What are the harmful effects of junk food? జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలివే!

What are the harmful effects of junk food? – జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలివే!

ఆధునిక జీవనశైలితోపాటు తీనే ఆ|హారంలో What are the harmful effects of junk food? ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యువ‌త, అదేవిధంగా పిల్ల‌ల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కు చాలామందికి జంక్ ఫుడ్స్ తిన‌డం అల‌వాటుగా మారింది.

ఇలా తినడం ప్రమాదకరమని తెలిసినా కూడా ముఖ్యంగా యువ‌త ఇంట్లో చేసిన ఆరోగ్య క‌ర‌మైన ప‌దార్థాల కంటే బ‌య‌ట జంక్ ఫుడ్స్‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

ఇలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా వయస్సు పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అయినప్ప‌టికీ రోజురోజుకు జంక్ ఫుడ్స్ తినే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. జంక్ ఫుడ్ తినేవారిలో పోషకాహార లోపం తలెత్తుతుందని, పోషకాహార లోపం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

What are the harmful effects of junk food?

ప్రతి రోజు జంక్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఇది హానికరం ఎందుకంటే.. Junk food is harmful

జంక్ ఫుడ్ లో  ఉప్పు పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి తీవ్ర వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చిప్స్, స్నాక్స్, బర్గర్‌లు, స్ప్రింగ్ రోల్స్, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్ కార‌ణంగా ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్త‌య‌ని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఆహారాలను ఎప్పుడూ తీసుకోవద్దని సూచిస్తున్నారు.

జంక్ ఫుడ్ వల్ల కలిగే దుష్ప్ర‌భావం : Adverse effects of junk food

జంక్ ఫుడ్‌లో అతి తక్కువ పోషణ విలువలు ఉంటాయి. ప్ర‌స్తుత ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది ఎక్కువ‌గా బ‌య‌ట అమ్మే ఈ ఫుడ్స్‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీన్ని ప్ర‌తి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి తీరని నష్టం జరుగుతుంది.

ఇవి శరీరంలో కొవ్వు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇది శరీరం, మెదడుపై తీవ్ర‌ ప్రభావం చూపుతుంది.

గుండె సమస్యలు: Heart problems

జంక్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్ల పరిమాణాలు ఎక్కువ‌గా ఉంటాయి అంతేకాకుండా ఇందులో పీచు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియ సమస్యల బారిన పడతారు.

దీని కారణంగా కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగి రక్తంలో మార్పులు వచ్చి తీవ్ర గుండెపోటు సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి .

కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి జంక్ ఫుడ్ తినడం మానుకోవాలి. అంతే కాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

తెల్ల జుట్టు సమస్యను తగ్గించండిలా..!

ఊబకాయం :obesity

జంక్ ఫుడ్‌లో చక్కెర, కేలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి, ఇవి బరువు పెరుగుదలకు కారణమవుతాయి. అంతేకాకుండా, మధుమేహం, కీళ్ల నొప్పులు,త‌దిత‌క‌ గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య‌ సమస్యలకు ఊబకాయం కార‌ణం.

డిప్రెష‌న్‌కు కార‌ణం జంక్ ఫుడ్ :Junk food causes depression

జంక్ ఫుడ్ తీసుకునే వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చిన్నారుల్లోనూ జంక్ ఫుడ్ ప్రభావంవల్ల చిన్న వయసులోనే ఒబేసిటీ బారినపడి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

జంక్ ఫుడ్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, చిన్నవయసులోనే బయటకు కనిపించని అనారోగ్యాలు వారిని ఇబ్బంది పెడతాయని హెచ్చరిస్తున్నారు.

జ్ఞాపకశక్తి సమస్యలు : Memory problems

అధిక మోతాదులో చక్కెరలు, కొవ్వులను తీసుకోవడం వ‌ల‌న‌ జ్ఞాపకశక్తిని పెంచే మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది.

జంక్ ఫుడ్స్ తినడం ద్వారా వారిలో జ్ఞాపక శక్తి మంద‌గిస్తుంద‌ని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఓ అధ్యయనంలో క‌నుగొన్నారు.

క‌ళ్ల కింద నల్ల‌టి వ‌ల‌యాలా.. ఈ టిప్స్‌తో త‌గ్గించుకోండి!

ఆకలి లేకపోవడం, జీర్ణశక్తి కోల్పోవడం :  loss of digestion

జంక్ ఫుడ్‌ను అతిగా తినడం కార‌ణంగా రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులకు కార‌ణమ‌వుతుంది. ఇది ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల ఆక‌లి త‌గ్గిపోతుంది. త‌ద్వారా జీర్ణ‌శ‌క్తిని కోల్పోయి క‌డుపులో నొప్పి రావ‌డం జ‌ర‌గుతుంది.

జంక్‌ఫుడ్ అనేక వ్యాధుల‌కు కార‌ణం : Junk food is the cause of many diseases

సాధార‌ణంగా చాలా మంది డ్ర‌గ్స్‌, అల్కహాల్‌కు బానిస‌ల‌వుతున్నారు. అవి లేక‌పోతే వారు ఉండ‌లేరు. అదేవిధంగా జంక్ ఫుడ్ తిన‌డం అల‌వాటైతే దానికి దూరంగా ఉండలేము.

అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలను జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి. లేక‌పోతే వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో ప‌డిన‌ట్లే అంటున్నారు వైద్య నిపుణులు.

What are the harmful effects of junk food?

నీళ్లు ఎక్కువ‌గా తాగాలి :Drink more water

నీళ్లు అధికంగా తాగ‌డం వ‌ల్ల ఆహార కోరిక‌లు అదుపులో ఉంటాయి. శ‌రీరం తేమ‌ను కోల్పోకుండా ఉంటుంది.

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌కు మ‌ధ్య గ్యాప్ ఇవ్వ‌కూడ‌దు : didnt give gap between breakfast, lunch and dinner

అల్పాహారం, భోజ‌నం, రాత్రి డిన్న‌ర్ చేసే ముందు ఎక్కువ‌గా గ్యాప్ ఇవ్వ‌కూడదు. ఎందుకంటే మ‌ధ్య‌లో పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తిన‌డం ద్వారా మ‌న‌సు జంక్ ఫుడ్స్‌పైకి వెళ్ల‌కుండా ఉంటుంది. అప్పుడు ఆహారం అమితంగా కాకుండా మితంగా తీసుకోవ‌చ్చు.

What are the harmful effects of junk food? – జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలివే!
ప్రోటీన్లు :proteins

కార్బోహైడ్రేట్స్‌తో పోల్చితే ప్రోటీన్లు జీర్ణ అవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. కాబ‌ట్టి గుడ్లు, పాల ప‌దార్థాలు, న‌ట్స్ వంటివి ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటితోపాటు కంటి నిద్ర‌, ఒత్తిడిని దూరం చేసే యోగా, ధ్యానం, వ్యాయామం వంటి చేయ‌డం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment