What are the causes of back pain? Follow the tips! నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నొప్పిని తగ్గించే చిట్కాలిగో!
ప్రస్తుతం సమాజంలో చాలా మంది నడుము నొప్పి What are the causes of back pain? Follow the tips! తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ నొప్పిసాధారణమైపోయింది. ముఖ్యంగా ఎక్కువ ఉద్యోగులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న వాతావరణంతోపాటు తినే ఆహారం, ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం ఇవ్వన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే ఉద్యోగుల్లో ఈ మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది. దాని ఉపశమనానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!
What are the causes of back pain? Follow the tips!
వెన్నునొప్పికి కారకాలు ఏమిటి?
ఎవరైనా వెన్నునొప్పిని కలిగి ఉన్నప్పటికీ, అనేక కారకాలు ప్రమాదాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:
- వయస్సు: తక్కువ వెన్నునొప్పి యొక్క మొదటి దాడి సాధారణంగా 30 నుంచి 40 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది. వయస్సుతో పాటు వెన్నునొప్పి మరింత సాధారణం అవుతుంది.
- ఫిట్నెస్ స్థాయి: శారీరకంగా దృఢంగా లేని వ్యక్తులలో వెన్నునొప్పి ఎక్కువగా ఉంటుంది. బలహీనమైన వెన్ను, ఉదర కండరాలు వెన్నెముకకు సరిగ్గా మద్దతు ఇవ్వకపోవచ్చు.
ఆహారం: కేలరీలు మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారం, నిష్క్రియాత్మక జీవనశైలితో కలిపి ఊబకాయానికి దారితీస్తుంది, ఇది వెన్నుపై ఒత్తిడిని కలిగిస్తుంది. - వంశపారంపర్యత: వెన్నునొప్పికి కొన్ని కారణాలు, ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్, వెన్నెముకను ప్రభావితం చేసే ఆర్థరైటిస్ యొక్క ఒక రూపం, జన్యుపరమైన భాగాన్ని కలిగి ఉంటాయి.
ఉపశమనం పొందడానికి చిట్కాలి
బరువు తగ్గించుకోవడం: weight loss
నడుము నొప్పి(Back pain)కి మొదటి కారణం బరువు పెరగడం. బరువు అధికంగా ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాయామం చేయడం, డైట్ పాటించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోగలిగి బ్యాక్ పెయిన్ కూడా కాస్త తగ్గుతుంది. తర్వాత చిన్న చిట్కాలు పాటించి ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. మరీ సమస్య అధికంగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలి.
వ్యాయామం.. – Exercise
రోజూ తప్పకుండా యోగా చేయడం, వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం చేయకపోవడం కూడా నడుమునొప్పికి కారణమని ఓ అధ్యయనంలో తేలింది. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో నలభైశాతం మందిలో చురుకుదనం తగ్గిందని అధ్యయనాలు వెల్లడించాయి. అదే విధంగా నడుము నొప్పి తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నడుముకి సంబంధించిన ఆసనాలను రోజూ వేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి నడుమునొప్పితో బాధపడేవారు యోగాసనాలు చేయడం మంచిది.
ఒత్తిడి – Stress
నడుము నొప్పిని తగ్గించుకోవాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు బాగా ప్రశాంతంగా నిద్ర పోవాలి. నిద్ర సమయంలో వెనుకభాగంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీన్ని తగ్గించుకునేందుకు వెన్నెముక కండరాలను బలోపేతం చేయడానికి రాత్రి పడుకునే ముందు కాళ్ల కింద దిండు వేసుకుని నిద్రించడం మంచిది. దీని ద్వారా ఒత్తిడి తగ్గి నడుము నొప్పి రాకుండా ఉంటుంది.
కాల్షియం, విటమిన్ డీ తీసుకోవడం ద్వారా.. – Calcium and Vitamin D
ఎముకలు దృఢంగా ఉన్నప్పుడు నడుము నొప్పి((Back pain) వంటి సమస్యలు దరి చేరవు. ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు ఈ నొప్పి వస్తుంది. కాల్షియం, విటమిన్ డీ అధికంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలు దృఢంగా మారి నడుము నొప్పి రాకుండా ఉంటుంది.
విటమిన్ డీ అధికంగా ఉండే పాలు, ఆకుకూరలు, పెరుగు అధికంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలివే!
చెప్పులు ధరించే విషయంలో జాగ్రత్తలు అవసరం
నడుము నొప్పిని నివారించడానికి చెప్పులు కూడా కీలక పాత్ర వహిస్తాయి. ఎత్తు చెప్పులు ధరించే వారికి నడుము నొప్పి తొందరగా వస్తుంది. అందుకే తక్కువ ఎత్తు ఉన్న చెప్పులు ధరించడం ద్వారా ఈ నొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు.
కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, నిలబడటం
ఆఫీసు కార్యాలయాల్లో కూర్చునే వారికి నడుము నొప్పి త్వరగా వస్తుంది. అందుకే గంటల తరబడి కూర్చోకుండా కొద్దిసేపు లేచి అటు ఇటూ నడవడం మంచిది. దీని ద్వారా బ్యాక్ పెయిన్ రాదు. నిల్చున్నా, కూర్చున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచింది.
బరువులు ఎత్తే సమయంలో..
బరువు ఎత్తే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పక్కకు తిరగకుండా బరువులు ఎత్తాలి. ఇప్పుడు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు వారి వయసు కన్నా వారు మోసే బ్యాగు బరువు ఎక్కువ. ఆ బరువు మోయలేక వంగిపోతూ ఉంటారు. దీంతో నడుము నొప్పి వస్తుంది. అదేవిధంగా బరువులు మోసే పనులు చేసే వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. వారు తగిన జాగ్రత్తలు పాటించాలి.
ప్రమాద సంకేతాలు
రకరకాల కారణాల వల్ల వచ్చే నడుమునొప్పి వెన్నెముకకి సంబంధించినది, ప్రమాదకరమైనది అని చెప్పడానికి కొన్ని సంకేతాలున్నాయి. నొప్పి అందించే ఇలాంటి సంకేతాలను ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత వేగంగా పరిష్కరించవచ్చు. ఆపరేషన్ అవసరాన్ని కూడా తగ్గించవచ్చు.
నొప్పితో పాటు జ్వరం
- ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం
- కాళ్లలో బలహీనత కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు.
- మూత్రం, మలవిసర్జనలపై అదుపు తప్పడం
- నడుము నొప్పితో పాటు తిమ్మిర్లు, కాళ్లు మొద్దుబారడం, మంటలు.
- సయాటికా నొప్పి అంటే నడుము నుంచి కాలిలోకి నొప్పి పాకడం వెన్నుపాము సంబంధిత నడుమునొప్పి ప్రధాన లక్షణం.