These Foods are summer in good for health..! – వేసవిలో ఇవి తింటే ఆరోగ్యానికి మేలు..!
వేసవిలో తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా These Foods are summer in good for health..! శరీరం నుంచి చెమట రూపంలో ఎక్కువగా నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది.
దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా These Foods are summer in good for health..! ద్రవపదార్ఢాలు తీసుకోవాలి. వీటి వల్ల విటమిన్లు సమృద్ధిగా అందుతాయి.
జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ పండ్ల రసాలు, పండ్లను రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో చూద్దాం..
మజ్జిగ – Butter milk :
వేసవికాలంలో తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్స్‌లో మజ్జిగ ఒకటి.
రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. అంతేకాదు… శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది.
మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచుతుంది.
శరీరాన్ని తేమగా ఉంచడంతో పాటు, కాల్షియం, ‘బి’ విటమిన్లను అందిస్తుంది. ఫలితంగా నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.
మజ్జిగ నేరుగా తీసుకోవడం కన్నా కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కూడా కలుపుకుంటే రుచితో పాటు ఫలితాలు బాగుంటాయి. జీర్ణశక్తికి తోడ్పడి శరీరం చల్లగా ఉంటుంది.
పుదీనా – Mint Leafs :
పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు.
పుదీనాతో మంచి ఫ్లేవరబుల్ చట్నీలు చేసుకోవచ్చు. ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
పుదీనా రసం ఇంట్లో సులువుగా చేసుకోగలిగిన పానీయం. పుదీనా ఆకులతో చేసే రసం. ఈ కాలంలో తగినంత నీరు అందక శరీరంలో వ్యర్థాలు పేరుకుంటాయి.
పుదీనారసం తాగడం వల్ల ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. బయట పనులు నిమిత్తం ఎండల్లో తిరిగేవారికి కూరల్లో కొత్తిమీర, పుదీనాలు ఎక్కువ మోతాదులో వేస్తే ఇవి శరీరాన్ని వడదెబ్బ నుండి కాపాడుతాయి.
ఉల్లిపాయలు – Onions :
ఉల్లిపాయలో చలువ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి . అందుకే వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
కర్రీస్, సలాడ్స్, రైతాలు, చట్నీస్‌లో చేర్చుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా మారుస్తుంది.
ఎర్ర ఉల్లిపాయల్లో క్విర్సిటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ యాంటీ అలర్జిన్ . వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.
వేసవిలో ఉల్లి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. బాడీని చల్లగా ఉంచుతుంది.
పుచ్చకాయ – Watermelons :
వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్ ఫుడ్ పుచ్చకాయ. ఈ రెడ్ కలర్ జ్యూస్ ఫ్రూట్ లో 90శాతం నీళ్లు, 10శాతం ఫ్లెష్ ఉంటుంది .
వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్లో ఉంచుతుంది.
కర్బుజ – Pumpkin :
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూజా పండులో దాగున్నాయి. అధికశాతం నీటిని కలిగి ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
ఖర్జూజాలో మాంసకృత్తులు, పీచు, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి.
రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో తోడ్పడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.
ఈ జ్యూస్‌ను క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
వేసవిలో డైలీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మరో ఆహారం ఇది. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది.
జామకాయ – Guava :
జామకాయలో విటమిన్ ‘సీ’ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.
ఇవి వేసవిలో ఆరోగ్యంగానూ, శక్తిమంతం గానూ ఉంచు తాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి.
కొబ్బరి నీళ్లు – Cocunut Water :
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి.
అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పారదోలడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తాయి.
వేసవిలో శరీరానికి కావాల్సిన ఐదు కీలక ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరము, సోడియం, ఇవి హైడ్రేషన్‌కు సహాయపడతాయి.
శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది.
డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ రాకుండా కాపాడే పానీయం కొబ్బరి నీరు. శక్తి కోసం తాగే ఎనర్జీ డ్రింక్‌లతో పోలిస్తే కొబ్బరిలో ఉండే పొటాషియం పదిహేను రెట్లు అధికం.
సిట్రస్ జాతి పండ్లు – Citrus Fruits :
నిమ్మ, బత్తాయి, కమలా వంటి సిట్రిక్ జాతి పండ్లలో విటమిన్ సి, ఐరన్ ఉంటుంది.
ఎండాకాలంలో శరీరానికి కావల్సిన శక్తినిచ్చేవి ఇవి. ఎండకు, వేడికి శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటికి పోతుంది.
నిమ్మకాయ శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
చెరకు రసం – Sugar Cane Juice :
వేసవి కాలం చెరకు రసం ఎక్కువగా లభ్యమవుతుంది దీనిలో ఖనిజలవణాలు అధిక పరిమాణంలో ఉంటాయి నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చెరకు రసం తాగితే శక్తి వస్తుంది.
చెరకు రసంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, మంట వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దంతక్షయాన్ని నివారిస్తుంది.
అల్ఫాహైడ్రాక్సీ వంటి యాసిడ్లు చర్మంపై యాక్నె రాకుండా చూస్తాయి. దీన్ని ఐస్ లేకుండా తాగడం మంచిది.
కీరదోస – Cucumber :
కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమ వుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం.
దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.
కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది.
దీనిలో ఉండే విటమిన్ ‘బి’ తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది.
కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి.
ఫైనాపిల్ – pinapple :
ఇందులో నీటితో కూడిన యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉం టుంది. కాబట్టి ఫైనాపిల్ తరచూ తీసుకోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ద్రాక్ష – pomegranate :
ద్రాక్షలో ఖనిజ లవణాలు చాలా ఎక్కువ. వేసవిలో వచ్చే ఎలర్జీలు, వాపు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
మొలకలు – Sprouts :
ఇవి ప్రొటీన్స్, ఫైబర్ గనులు. తేలికగా జీర్ణమవుతాయి. వేడి వాతావరణంలో మంచి ఆహారం.
చిరుధాన్యాలు – Grains :
గోధుమలు, బియ్యానికి బదులుగా రాగి, జొన్నలు, క్వినోవా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఆరురెట్లు ఎక్కువ.
రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
సోయాబీన్స్ – Soybeans :
వేసవిలో సోయాబీన్స్ ను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కావున మీ శరీరానికి కావలసిన పోషకాలు అన్ని కూడా ఇస్తాయి.
సోయాబీన్స్ ను నానబెట్టి ఆ తర్వాత ఉడకబెట్టుకొని కూరల్లో చిరు కలుపుకొని తినడం ద్వారా చక్కటి పోషకాలు మీకు లభించే అవకాశం ఉంది.
పాలను సైతం తీసుకోవడం ద్వారా మీకు మంచి పోషకాలు లభిస్తాయి. మార్కెట్లో సోయా మిల్క్ రూపంలో సోయా పాలు లభిస్తాయి.
అదేవిధంగా సోయా చాంక్స్ వీటినే మిల్ మేకర్ అని కూడా అంటారు. వీటిని కూడా తీసుకోవడం ద్వారా మీకు మంచి పోషకాలు లభిస్తాయి.
పప్పు దినుసులు – Pulses :
వేసవి కాలంలో పప్పు దినుసులను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన శరీరం చెమట రూపంలో శరీరానికి కావలసిన లవణాలను మినరల్స్ ను ఎక్కువగా కోల్పోతుంది.
పప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కావున వేసవిలో పప్పు దినుసులతో చేసిన వంటకాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎందుకంటే వేసవికాలంలో మాంసాహారం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
కావున మాంసాహారానికి బదులు శాఖాహార ప్రోటీన్స్ అయినటువంటి పప్పు దినుసులను తీసుకుంటే చాలా మంచిది.
అరటి, సపోటా, దానిమ్మ : Banana, Sapota, Pomegranate :
ఎండాకాలం అయితే తక్షణ శక్తి కోసం అరటిని ఆశ్రయించాల్సిందే. వేసవి కాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. దాహర్తిని తీర్చేందుకు సపోటా మంచి ఫలం.
పోషకాలతో పాటు జీర్ణక్రియ సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తూ, అందాన్ని కాపాడే పండు. దానిమ్మ. ఇందులో పీచు పదార్థాలు కూడా ఎక్కువే.
నీటి శాతం ఎక్కువగా ఉన్న తాజా ఆకుకూరలు, కూరగాయలు, కీరదోస, క్యారెట్, ఎక్కువగా తీసుకోవాలి.
బత్తాయి పండు వేసవి కాలంలో దాహనికి చెక్ పెడుతుంది. ఎక్కువ నీటి శాతాన్ని కలిగి వుండే ఈ పండు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడుతుంది.
వేసవిలో తాటి ముంజలు : Palm trees in summer:
వీటి ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా వేసవిలోనే లభించే ఈ ముంజలు రుచిలోనే కాదు పోషకాల్లోనూ ముందే ఉంటాయి.
ఇవి మీ శరీరాన్ని చల్లబరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఇందుకోసం ఈ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
మసాలా, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. తాజాగా వండుకున్న ఆహారమే తినాలి.
వృద్ధులకు జావ, ఉప్మా, రాగిదోశ, అటుకులు లాంటివి ఉదయం అల్పాహారం పెట్టాలి.
చిప్స్, నూడుల్స్ లాంటి ఆహారాన్ని దూరంగా ఉంచడం ఎప్పటికైనా మంచిది.
Good Job Anna❤️