ఆరోగ్యంగా ఉండాలంటే These are the asanas reduce belly fat..! ధ్యానం, యోగా, వ్యాయామం చేయడం తప్పనిసరి. ఎలాంటి సమస్యలు రావు. చాలా మంది బెల్లి ప్యాట్, అధిక బరువు, ఊబకాయం మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. వాటిలో బెల్లీ ప్యాట్‌ను కొన్ని ఆసనాలు వేయడం ద్వారా తగ్గించుకోవచ్చు.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. యోగాతో తలనొప్పి, వెన్నునొప్పి. బరువు తగ్గడానికి ఇన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆ ఆసనాలు ఏంటో తెలుసుకుందామా..
These are the asanas reduce belly fat..!
యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి వంటి ఎనిమిది విభిన్న
భాగాలు ఉంటాయ. అదేవిధంగా పలు యోగా ఆసనాలు కూడా ఉన్నాయి. అవి వేయడం ద్వారా నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు.
1.నవాసనం : Navasana
దీన్ని బోట్ ఫోజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం ఉదర కండరాలను బలోపేతం చేయడానికి నడుము చట్టు ఉన్న కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సహకరిస్తుంది. .
జీర్ణక్రియ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. పొత్తి కడుపు బలాన్ని పెంచుతుంది.
2.ఫలకాసనం : Phalakasana
ప్లాంక్ పోజ్‌గా పిలుస్తారు. ఈ ఆసనం ఉదర కండరాలపై దృష్టి సారించే పూర్తి- శరీర వ్యాయామంగా పనిచేస్తుంది. పుష్-అప్ స్థానంతో ప్రారంభించాలి. ఇది నడుము కొవ్వును కరిగించడానికి, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
3.భుజంగాసనం : Bhujangasana
సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని అర్థం. ఈ ఆసనం చేయడం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ ఆసనం వల్ల పొత్తికడుపు కండరాలు టోన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
భుజంగాసనం చేయడం వల్ల వశ్యత పెరుగుతుంది. వెన్నెముక బలంగా తయారవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసకోశ పనితీరు మెరుగవుతుంది. భుజాలు, మెడను బలంగా మారుస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది. దీని వల్ల పొట్ట టోన్డ్ అవుతుంది.
నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నొప్పిని తగ్గించే చిట్కాలిగో!
4.ధనురాసనం :Dhanurasana
దీన్ని బౌ పోజ్ అంటారు. ధనురాసం చేయడం వల్ల స్ట్రెంథ్‌ని బూస్ట్ చేస్తుంది. దీంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కోర్ కండరాలను బలోపేతం చేయడానికి , ఉదర కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
5.వంతెన బంధాసనం : Setu Bandhasana
బ్రిడ్జ్ పోజ్ అని కూడా పిలుస్తారు. దీనికి సేతు బంధాసన అని మరో పేరు. ‘సేతు,’ అంటే వంతెన. వంతెనను పోలి ఉండే ప్రాథమిక యోగా భంగిమ. ఈ ఆసనం బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడానికి మరియు పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
6.వీరభద్రాసన III: Virabhadrasana III
వారియర్ III అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం మొత్తం శరీరాన్ని బలపరుస్తుంది. ఉదరాన్ని బలోపేతం చేయడానికి, స్థిరత్వం, సమతుల్యత, దృష్టి, సమన్వయాన్ని పెంచుతుంది. వీరభద్రాసన III యోగాలో శక్తివంతమైన నిలబడి ఉండే భంగిమ.
7.పవనముక్తాసనం :Pavanamuktasana
విండ్-రిలీవింగ్ పోజ్ అని కూడా పిలుస్తారు, విడుదల చేసే భంగిమ అని అర్థం. అపాన వాయువు(గ్యాస్)ను బయటకు పంపించడమే కాదు.. మలబద్ధకాన్ని తగ్తిస్తుంది.
వెన్ను పొత్తికడుపు కండరాలకు మసాజ్‌లా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గింస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
తెల్ల జుట్టు సమస్యను తగ్గించండిలా..!
8.తాడాసనం :Tadasana
మౌంటైన్ పోజ్ అని కూడా పిలుస్తారు. తాడాసనం అనేది సంస్కృత పదం. తడ అంటే పర్వతం, ఆసనం అంటే భంగిమ అని అర్థం.
తాడాసనం అనేది దృఢమైన పర్వతంలా బలంగా నిలబడే భౌతిక స్వరూపం. శరీర భంగిమను మెరుగుపరుస్తుంది.
ఈ ఆసనం సృజనాత్మకత, అంతర్ దృష్టిని రేకెత్తిస్తుంది, మనస్సును క్రియర్‌గా ఉంచుతుంది. నాడీ వ్యవస్థను ఏకీకృతం చేస్తూ నిరాశను అధిగమిస్తారు. ఊపిరితిత్తులలోని అల్వియోలార్ మార్గాలను తెరవడానికి సహాయపడుతుంది.
ఈ ఆసనం ఈ ఆసనం వేస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వేగంగా బరువు కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు.
9.ఉత్తానాసనం: Uttanasana
ఇది పొట్టని కరిగించే పవర్ ఫుల్ ఆసనం. బెల్లీ ఎక్కువున్నవారికి చేయడం కాస్తా కష్టమే. నడుము నుండి పై భాగాన్ని వంచి పాదాలను తాకాలి. తాకినప్పుడు కాళ్ళు స్ట్రెయిట్‌గా ఉండాలి. కాళ్ళని వంచకూడదు. దీనినిన చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది.
10.సూర్యనమస్కారం:
యోగాసనాల్లో సూర్యనమస్కారాలు చాలా ముఖ్యమైనవి. దీనినే చేయడం వల్ల మొత్తం శరీర కదలిక పెరుగుతుంది. దీని వల్ల అన్ని అవయవాలకు వర్కౌట్ అవుతుంది. దీంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. కండరాలు బలంగా మారతాయి. జీవక్రియ పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ కూడా స్పీడ్‌గా కరుగుతుంది.
11.వక్రాసనం: suryanamaskar
ఈ ఆసనం చేయడం వల్ల బెల్లీ, సైడ్ ఫ్యాట్ రెండూ కరుగుతాయి. ఈ ఆసనం వేసేలప్పుడు పొత్తికడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఆ ప్రాంతంలో కొవ్వు కరిగి పొట్ట తగ్గుతుంది