పిల్లలకు సీజనల్ వ్యాధులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Seasonal diseases for children.. these precautions are mandatory!
ఎండల నుంచి ఊరటనిచ్చే వర్షాకాలం పిల్లలకు ఎంతో ఇష్టం. చల్లదనం, Seasonal diseases for children.. these precautions are mandatory!ఆనందంతో పాటే వర్షాకాలంలో పిల్లలు కాస్త తొందరగా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడే అవకాశమూ ఉంటుంది. కొంతమందిని ఫంగల్ ఇన్ఫెక్షన్లు, లేదా జీర్ణ సంబంధిత వ్యాధులూ ఇబ్బంది పెడతాయి.
Seasonal diseases for children.. these precautions are mandatory!
ముందుగానే పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెప్పి సిద్ధం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం పాడవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి జ్వరాలు, జలుబు లేకుండా ఈ వర్షాకాలంమంతా హాయిగా గడిచిపోతుంది.
ముఖ్యంగా వర్షాకాలంలో చిన్నారులు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి ఫ్లూ జ్వరాలు, విరోచనాలు, వాంతులు కూడా వర్షాకాలం చిన్నారులలో ప్రధానంగా కనిపిస్తాయి.
మరిగించిన నీరే మేలు! – Hot water :
వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఎక్కువగా నీళ్ల వల్లే వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలకు ఏ నీళ్లు పడితే అవి ఇవ్వకుండా.. బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్న నీటిని అందించడం శ్రేయస్కరం.
ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల్ని బయట దొరికే నీరు, జ్యూసులు.. లాంటి పానీయాలకు దూరంగా ఉంచడం మంచిది.
బాగా కడగాలి.. – Wash well :
వర్షాకాలంలో పిల్లలకు కూరగాయలు ఎక్కువగా పెట్టడం మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్రిములను, బ్యాక్టీరియాను నాశనం చేయడంలో తోడ్పడతాయి.
అలాగే ఆకుకూరల్లో ఆకు పురుగులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకుకూరలైనా, కూరగాయలైనా.. వండే ముందు పరిశుభ్రంగా కడగటం చాలా ముఖ్యం.
వేడివేడిగా.. – Hot :
ఏ పూటకాపూటే వేడివేడిగా, శుభ్రంగా వండిన ఆహార పదార్థాలే పిల్లలకు పెట్టడం మంచిది. ఫ్రిజ్‌లో ఉంచాం కదా అని రెండు రోజుల కిందట తయారు చేసిన ఆహారం తింటే పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది.
దుస్తుల విషయంలో.. – In terms of clothing :
వర్షాకాలంలో పిల్లల శరీరాన్ని నిరంతరం పొడిగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వాళ్లు ఆడుకునేటప్పుడు వచ్చే చెమటను గ్రహించడానికి వదులుగా, పొడిగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి.
ఒకవేళ పిల్లలు వానలో తడిస్తే.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తడి బట్టలను తీసేయాలి. ఎందుకంటే తడి బట్టల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో ఎప్పుడూ పొడిగా ఉండే దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
అలాగే చర్మం కూడా పొడిగా ఉండేలా చూడటం ముఖ్యం. ఇంకా పిల్లల చెప్పులు, సాక్సులు, రెయిన్‌కోట్, గొడుగు శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టాలి.
గోళ్లు కొరుకుతున్నారా?? – Bitting your nails :
బయట ఎక్కువగా ఆడటం వల్ల పిల్లలకు గోళ్లలో మురికి చేరిపోతుంటుంది. వర్షాకాలంలో అయితే మరీనూ!! కాబట్టి పిల్లలు చేతులు నోట్లో పెట్టుకోకుండా, గోళ్లు కొరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇలా ఎందుకు చేయకూడదో ఒకటికి రెండుసార్లు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే బయటి నుంచి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్ని శుభ్రంగా కడగాలి.
కొంతమంది కట్ చేసిన పండ్లను ఎక్కడపడితే అక్కడ పెడుతుంటారు. పైగా వాటిపై కనీసం మూతలు కూడా పెట్టరు. దీంతో వాటిపై ఈగలు వాలి రకరకాల రోగాలను వ్యాపింపజేస్తాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం అంత మంచిది కాదు. కాబట్టి అవసరమున్నప్పుడే పండ్లను కట్ చేసుకోవడం మంచిది. అలాగే వండిన పదార్థాలపై నిండుగా మూతలు పెట్టడం చాలా ముఖ్యం.
- ఫాస్ట్ ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవడం సహా ఆర్వో వాటర్ వాడితే మరీ మంచిది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే డ్రైఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
- వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా ఎక్కువే కాబట్టి కాచి చల్లార్చిన నీటినే వాడడం మేలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో పిల్లలకు పోషకాహారం పెట్టాలి. అలాగే తాజాగా వండిన ఆహారాన్ని పెట్టాలి.
- రోజువారి ఆహారంలో ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, నట్స్, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి.
ఆలస్యం చేయకుండా..- Avoid delay:
- ఈ కాలంలో పిల్లలకు ఏదైనా జలుబు, జ్వరం.. లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి తాత్కాలిక ఉపశమనానికి సొంత వైద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది.
- అందులోనూ కరోనా విజృంభిస్తున్న వేళ- ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి సరైన వైద్యం చేయించి, చిన్నారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
- దోమ తెరలను విరివిగా వాడడం సహా ఇంటి తలుపులకు జాలీల వంటివి పెట్టుకోవాలి.
- వర్షాకాలంలో ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటుంటారు.
వర్షాకాలంలో వచ్చే సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివి!
We can take these type of precautions :
- జంక్ ఫుడ్ జోలికి పోకుండా సమతుల్య ఆహారం తినిపించండి. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం, రోడ్డు పక్కన చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్, సరిగ్గా ఉడకని లేదా పచ్చిగా ఉన్న ఆహారం తినిపించకండి.
- కాచి చల్లార్చిన వేడి నీళ్లను తాగించండి. స్కూల్ కి వెళ్లేటపుడు కూడా అవే నీళ్లను బాటిల్ లో పోసి ఇవ్వండి.
వాళ్ల వయసు ప్రకారం వాళ్లకు వేయించాల్సిన వ్యాక్సినేషన్లు పూర్తిచేయండి. - ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచండి. దోమలు పెరగకుండా జాగ్రత్తపడాలి. వాటివల్ల మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
- తడిగా ఉండే బట్టలు, షూలు వేయకండి. ఎండ లేకపోతే హెయిర్ డ్రైయర్ సాయంతో తడి ఆరేలా చూడండి. వాటివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.
- భోజనం చేసేకన్నా ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
బయట ఆడుకునే వీలు లేకపోతే, శారీరక వ్యాయామం కోసం ఇంట్లోనే స్కిప్పింగ్, టేబుల్ టెన్నిస్ లాంటి ఆటలు ఆడేలా ప్రోత్సహించండి. - త్వరగా ఆరిపోయే బట్టలు వేయండి.
- పిల్లల ఒంటికంతా బట్టలు వేసేముందే టాల్కమ్ పౌడర్ రాయండి.
- షూలు వేసుకుంటారు కాబట్టి, పాదాలకు యాంటీ ఫంగల్ పౌడర్ రాస్తే ఇంకాస్త మంచిది. రెయిన్ కోట్లు, గొడుగులు, నీళ్ల నుంచి రక్షించే గమ్ బూట్స్ సిద్ధం చేయండి.
- తులసి, దాల్చిన చెక్క, నిమ్మకాయం, అల్లం లాంటి మూలికల్ని వాళ్ల ఆహారంలో చేర్చండి. వీటిలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటూ జ్వరాలు రాకుండా కాపాడతాయి.
- పిల్లల్లో ఎలర్జీ సమస్య ఉంటే కార్పెట్లు, కర్టెన్లు లాంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.
- ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే పిల్లలకు సోకకుండా జాగ్రత్తపడండి. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేస్తూ ఉండండి. పిల్లలను దగ్గరగా రానీయకండి.
- ఈ కాలంలో మురికి నీళ్లలో ఆడుకుంటే జరిగే నష్టాలు చెప్పండి. వాళ్లే దూరంగా ఉంటారు.
పొడవాటి చేతులున్న షర్టులు, ప్యాంట్లు వేయండి. దోమల నుంచి ఇవి రక్షిస్తాయి. అవసరమైతే ఇంట్లో దోమతెర వాడండి.
బయట నుంచి ఇంటికి రాగానే చేతులు కడుక్కోవడం అలవాటు చేయండి.
Good article keep it up
And write more topics on health