diseases risk from contaminated water and food in summer – వేస‌విలో క‌లుషిత నీరు, ఆహారంతో వ్యాధుల ముప్పు

Diseases risk from contaminated water and food in summer – వేస‌విలో క‌లుషిత నీరు, ఆహారంతో వ్యాధుల ముప్పు

వేస‌విలో ఎండ‌లు Diseases Risk from contaminated water and food in summer ముదురుతున్నాయి. ఉద‌యం తొమ్మిది గంట‌ల నుంచే ఎండ మంట ముదిరిపోతోంది. రాత్రి వేళ‌ల్లోనూ వేడి త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలో ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగే వారు వ‌డ‌దెబ్బ‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది.  ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల మ‌ధ్య‌లో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముఖ్యంగా ఏసీ గ‌దుల నుంచి ఒక్క‌సారిగా ఎండ‌లోకి వ‌చ్చే వారికి ఈ ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌తీ ఏడాది మార్చి, మే నెల‌ల్లో ఎండ‌దెబ్బ‌కు గురై ఆసుప‌త్రుల్లో చేరే బాధితుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది.

మార్చి నెల ప్రారంభ‌మ‌వుతోంది. ఇప్పుడే ఎండ‌లు మండిపోతున్నాయి. ప్ర‌స్తుతం 30 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రాబోయే రోజుల్లో 40 నుంచి 45 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

Diseases Risk from contaminated water and food in summer
వేస‌విలో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం : Precautions Needed in Summer:

వేస‌విలో నీటి ఎద్ద‌డి కార‌ణంగా నీరు క‌లుషితమ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆహారం

Risk of diseases from contaminated water and food in summer

కూడా త్వ‌ర‌గా పాడై పోతోంది. వేడి వాతావ‌ర‌ణంలో లెజియోనెల్లా, ఈకొలి, షిజెల్లా, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాల వ్యాపిస్తాయి.

క‌లుషిత నీరు. ఆహారం ద్వారా ఇవి మ‌రింత వ్యాప్తి చెందుతాయి. వండి నిల్వ ఉంచిన ఆహార ప‌దార్థాల్లో, ఈగ‌ల ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. హైప‌టైటిస్ వైర‌సల్ ఇన్‌ఫెక్ష‌న్లు కూడా క‌లుషిత నీటి ద్వారా విజృంభిస్తాయి.

దేశంలో ఐదేళ్లలోపు పిల్ల‌ల మ‌ర‌ణాల‌కు 13 శాతం డ‌యేరియాన కార‌ణమ‌ని అధ్య‌యాలు చెబుతున్నాయి. దీని బారిన ప‌డి దేశంలో ఏటా రెండు ల‌క్ష‌ల మంది పిల్ల‌లు మ‌ర‌ణిస్తున్నార‌ని అంచ‌నా.

పోష‌కాహారం లోప‌మున్న పిల్ల‌లో వాంతులు, విరేచ‌నాలు ఎక్కువైన‌ప్పుడు, వారికి స‌రైన స‌మ‌యంలో చికిత్స అందించ‌క‌పోతే ప్రాణాపాయం సంభ‌విస్తుంది.

వ‌డ‌దెబ్బ ముప్పు : sunburn

Risk of diseases from contaminated water and food in summer

ఎండ‌లు ముదురుతున్న కొద్దీ ఎండ‌దెబ్బ తగిలే అవ‌కాశాలు ఎక్కువ‌. వేడి వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రించే వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంది. శ‌రీరంలోని వేడిని చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు పంపించే మార్గాలు మూసుకుపోతాయి.

ఫ‌లితంగా శ‌రీరంలో వేడిమి అంత‌కంత‌కూ పెరిగిపోయి కుప్ప‌కూలిపోతాయి. అప్పుడు అత్య‌వ‌స‌రంగా వైద్య చికిత్స అందించాల్సి వ‌స్తుంది.

మండు వేస‌విలో ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ఎండ‌దెబ్బ‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్ల‌లు, 65 ఏళ్ల‌లోపు వృద్ధులు, దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, వేడికి ద‌గ్గ‌ర‌గా ప‌నిచేసే వారు, ఆరోగ్య సంర‌క్ష‌ణ విష‌యంలో ముందుగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఎప్పుడు ప్ర‌మాదం అంటే.. ?

శ‌రీరం నుంచి నీరు త‌గ్గిపోయిన‌ప్పుడు  ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ప్ర‌మాదం. కాబ‌ట్టి వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

  1. జ్వ‌రం 101 డిగ్రీల కంటే ఎక్కువ రావ‌డం,
  2. 5 నుంచి 6 గంట‌ల సేపు విసర్జ‌న నిలిచిపోవ‌డం,
  3.  చ‌ర్మం పొడి బారిపోవ‌డం, లాగితే సాగిపోతూ ఉండ‌టం,
  4. క‌ళ్లు క‌చించుకుపోవ‌డం,
  5. బాగా నిర‌సంగా ఉండ‌టం,
  6. నాలుక తడి ఆరిపోవ‌డంం,
  7.  ఎంత ఏడ్చినా క‌న్నీళ్లు రాక‌పోవ‌డం.
వేసవిలో  క‌లుషిత నీరు, నిల్వ ఆహారం వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు : Diseases caused by contaminated water and stored food in summer:
  1.  నీళ్ల విరేచ‌నాలు (డ‌యేరియా),
  2. జిగ‌ట విరేచ‌నాలు(డీసెంట్రీ),
  3. అతిసారం,
  4. కామెర్లు,
  5. టైఫాయిడ్‌,

అమీబియాసిస్‌

వేసవిలో వచ్చే  వ్యాధులు : Summer diseases
వడదెబ్బ : Sunstroke

వేసవిలో అధిక ఉఫ్ణోగ్రతల ప్రభావంతో డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఎండలో అధిక సమయం గడిపినా వడదెబ్బ తగులుతుంది. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే నీటిని అధిక మొత్తంలో తీసుకోవాలి. నిమ్మరం, కొబ్బరి నీరు, గ్లూకోజ్ వంటి వాటిని తీసుకోవాలి.

వడదెబ్బ తగిలితే సకాలంలో చికిత్స పొందటం అవసరం. లేకుంటే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎండ అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్ల‌డం త‌గ్గించాలి.

నిల్వ ఆహారం : Stored food

వేసవిలో అధిక వేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని నివారించడానికి, ఆహారం చెడిపోకుండా చూసుకోవాలంటే ఆహారాన్ని బాగా ఉడికించాలి.

Risk of diseases from contaminated water and food in summer

చర్మ సమస్యలు : Skin problems

అధిక తేమ, వేడి కారణంగా చర్మంపై ఎరుపు దద్దుర్లు. స్వేద గ్రంథులు మూసుకుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి.

ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కమిలిపోతుంది. చెమట వల్ల మచ్చలు , దురద, మంట వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్లు ఉపయోగించండి.

అతిసారం : Diarrhea

ఎండవేడి కారణంగా ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటి ఆహారం తీసుకుంటే వేసవిలో విరేచనాలు సాధారణం. కలుషిత ఆహారం తినడం ,మద్యపాన అలవాట్లు డయేరియాకు దారితీస్తాయి.

అతిసారం నుండి దూరంగా ఉండటానికి, నీటిని మరిగించిన తర్వాత మాత్రమే త్రాగటం అలవాటుగా మార్చుకోవాలి. కూరగాయలను ముక్కలు చేయడానికి ముందు, తర్వాత వాటిని బాగా కడగాలి.

అమ్మోరు : Chickenpox

చికెన్‌పాక్స్ వేసవి వ‌చ్చే వ్యాధులలో ఒకటి. ఇది అధిక జ్వరంతో శరీరంపై ఎరుపు రంగులో ఉండే చిన్న దద్దుర్లు రూపంలో ప్రారంభమవుతుంది. ఇది పిల్లలలో , తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి.

తట్టు : Rash

మీజిల్స్ .. వేసవి వ‌చ్చే మరో సాధారణ  వ్యాధి. మీజిల్స్‌కు కారణమయ్యే పారామిక్సోవైరస్ వేసవిలో వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ లక్షణాలు దగ్గు, అధిక జ్వరం, గొంతు నొప్పి , క‌ళ్లు ఎర్రబడటం. తరువాతి దశలో, చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీజిల్స్ దద్దుర్లు శరీరం అంతటా కనిపిస్తాయి.

కామెర్లు : Jaundice

కామెర్లు నీటి ద్వారా సంక్రమించే సాధారణ వ్యాధి. ఇది హెపటైటిస్ A వల్ల వస్తుంది. ప్రధానంగా కలుషితమైన ఆహారం , నీటి వినియోగం వల్ల వస్తుంది.

సకాలంలో చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి కాలేయం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది, ఇది పిత్తం అధిక ఉత్పత్తికి దారితీస్తుంది.

టైఫాయిడ్ : Typhoid

టైఫాయిడ్ ఆరోగ్యకరమైన వ్యక్తులకు నోరు ,మల మార్గం ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి వనరులు బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారతాయి. టైఫాయిడ్ వస్తే బలహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపులో నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గవదబిళ్లలు : Mumps

వేసవి వ్యాధులలో, గవదబిళ్లలు ; మరొక అత్యంత అంటువ్యాధి. ఈ వైరల్ వ్యాధి పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ అంటువ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది. లాలాజల గ్రంథి వాపు, కండరాల నొప్పి, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చెమటతోపాటు శరీరంలో ఉండే పొటాషియం, సోడియం, క్లోరైడ్, పాస్పరస్‌ వంటి లవణాలు కూడా బయటకు పోతాయి. ఇవి తిరిగి శరీరంలోకి చేరాలంటే తప్పకుండా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగాలి.

వడదెబ్బ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే చక్కెర, ఉప్పు కలిసిన నీరు తాగాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చలికాలంలో వచ్చే వైరస్‌ల కంటే వేసవిలో వచ్చే వైరస్ లు ప్రమాదకరమైనవని గ్రహించాలి.

These Foods are summer in good for health..! – వేసవిలో ఇవి తింటే ఆరోగ్యానికి మేలు..!

వ‌డ‌దెబ్బ సోకినప్పుడు..

  1. వ‌డ‌దెబ్బ సోకిన వ్య‌క్తిని వెంట‌నే చ‌ల్ల‌టి ప్ర‌దేశానికి తీసుకెళ్లాలి.
  2. దుస్తులు విప్పి గాలి బాగా ఆడే ప్ర‌దేశంలో ఉంచాలి.
  3. సాధార‌ణ ఉష్ణోగ్ర‌త వ‌చ్చే వ‌ర‌కు వ‌డ‌దెబ్బ సోకిన వ్య‌క్తి శ‌రీరాన్ని త‌డిగుడ్డ‌తో తుడుస్తూ ఉండాలి.
  4. నొప్పి మాత్ర‌లు, పారాసిట‌మాల్ వంటి మందుల వ‌ల్ల వ‌డ‌దెబ్బ‌కు గురైన వారిలో ఆరోగ్యం మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది. అందుకు జ్వ‌రం త‌గ్గించే మాత్ర‌లు వారికి ఇవ్వ‌కూడ‌దు.

దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తుల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం : 

  • ఎండాకాలంలో సాధ్య‌మైంత వ‌ర‌కు వేడిగా.. అప్పుడే వండిన తాజా ఆహారాన్ని తిన‌డమే మేలు. పండ్లు, కూర‌గాయ‌ల ముక్క‌లు అప్ప‌టిక‌ప్పుడు కోసుకుని తినాలి.
  • క్లోరినేష‌న్ చేసిన లేదా కాచి చ‌ల్లార్చిన నీటిని తాగాలి.
  • ఆహార ప‌దార్థాపై ఈగ‌లు వాల‌కుండా మూత‌లు పెట్టాలి.
  • వాంతులు, విరేచ‌నాలు అవుతున్న‌ప్పుడు ఓఆర్ ఎస్ ద్రావ‌ణం, ఉప్పు, చ‌క్కెర క‌లిపిన నీళ్లు, మ‌జ్జిగ వంటివి తాగాలి.
  • ఎండ‌లో వెళ్లేట‌ప్పుడు సూర్య కిర‌ణాలు నేరుగా తాక‌కుండా త‌ల‌కు టోపీ, కానీ ద‌ళ‌స‌రి వ‌స్త్రం కానీ ధ‌రించాలి. ఇంట్లో కూడా చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉండేలా చూసుకోవాలి.
  • ర‌క్త‌పోటు, మ‌ధుమేహం ఉన్న వారు వాడే మందుల వ‌ల్ల కొన్ని ల‌వ‌ణాలు చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.అందువ‌ల్ల వీరు వ‌డ‌దెబ్బకు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

 

1 thought on “diseases risk from contaminated water and food in summer – వేస‌విలో క‌లుషిత నీరు, ఆహారంతో వ్యాధుల ముప్పు”

Leave a Comment