Basic Principles for Holistic Health – సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాథమిక సూత్రాలు
ఆరోగ్యం Basic Principles for Holistic Health అందరికీ ఎంతో ముఖ్యం. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటే అంతకుమించిన ఐశ్వర్యం ఏమీ లేదు.
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నా పెద్దా, వృద్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు.
ఈ క్రమంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను దరి చేరకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే పాటించండి. అవేంటంటే..
1.ప్రతిరోజూ వ్యాయామం – Every day Exercise
వ్యాయామం లావుగా ఉన్నవారు మాత్రమే కాదు.. సన్నగా ఉన్నా చేయాలి. వ్యాయామం చేయకపోతే తీసుకునే ఆహారం కొవ్వుగా మారుతుంది.
అందుకు శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం వల్ల రక్తపోటు, మధుమేహం, వంటి సమస్యలు దరి చేరవు.
- రోజుకు కనీసం 45 నిమిషాల నుంచి గంట సమయం పాటు వ్యాయామంచేయాలి. అధిక రక్తపోటు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
- అంతే కాకుండా చెమట రూపంలో చర్మంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళతాయి.
- ఇంట్లో ఏదో ఒక పని చేయడం ద్వారా గుండె సామర్థ్యం పెరిగి రక్తప్రసరణ జరిగి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
- అదేవిధంగా గుండె, శ్వాస వేగాన్ని పెంచేందుకు రన్నింగ్, సైక్లింగ్ వంటివి కూడా చేస్తే మంచిది.
2.నీళ్లు బాగా తాగాలి- More Drink Water
శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఉండడానికి ప్రతీ రోజూ కనీసం ఐదు లీటర్ల నీటిని తాగాలి. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ జరిగి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చాలా మంది ఎక్కువగా నీరు తాగరు. అలాంటి వారు దోస, పుచ్చకాయ, కరబూజ, వంటివి తీసుకోవాలి. దోసలో నీటి శాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండి బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తి అదుపులో ఉంటుంది.
3.కంటి నిండా నిద్ర – Eyes Fully Sleep :
నిద్రలేమి అనేక అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి నిద్రకు సమయం కేటాయించాలి. సరైన నిద్ర.. మనం రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుంది. రోజుకు కనీసం 8 గంటలు నిద్రించాలి.
- అధికంగా నిద్రిస్తే.. గుండె జబ్బు, మధుమేహం, పక్షవాతం వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. నిద్రకు గంట ముందు రెండు పండ్లు తింటే బాగా నిద్ర పడతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- నిద్రించడం ఎంత ముఖ్యమో.. ఉదయాన్నే నిద్ర లేవడం కూడా ముఖ్యమే. ఉదయాన్నే నిద్ర లేచి కొంత సమయం వరకు ఎండలో ఉంటే శరీరానికి చాలా మంచిది. దీనివల్ల డీ విటమిన్ అందుతుంది. డీ విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఎముకలు విరగడం, వెన్ను నొప్పి తదితర శరీర రుగ్మతలు రాకుండా ఉంటాయి. నిద్రించే ముందు ఏదైనా కొంచెం ఆహారం తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో నిద్రించరాదు. అదేవిధంగా నిద్రకు ముందు వ్యాయామం లాంటివి చేయకూడదు.
4.సరైన ఆహారం- Healthy food
పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మాంసకృత్తులు, పిండి పదార్థాలు అధికంగా శరీరానికి అందడంతో ఆరోగ్యంగా ఉంటారు. రోజూవారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతోంది. ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు భోజనం తీసుకుంటే గుండె, రక్తనాళాలు మంచిది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉండి రక్తనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.
- గుడ్డు తినడం వల్ల ఇందులో విటమిన్ 6, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నిషియం, సోడియం, ఐరన్, జింక్ పోషకాలు ఉంటాయి.
- ఇది గుండె, కళ్లు, మెదడుకు మేలు చేస్తుంది.
- అదేవిధంగా నట్స్(డ్రైఫ్రూట్స్ (జీడీపప్పు, వాల్ నట్స్, బాదం పప్పు ) తినడం వల్ల యాంటి ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా మన శరీరానికి అందుతాయి.
- అధిక బరువు, జీర్ణ సమస్యలు, మధుమేహం ఉన్న వారికి అల్లం చాలా ఉపయోగపడుతుంది.
- ఉల్లి.. చేసిన తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి వంటల్లో రుచిని పెంచడమే కాకుండా విటమిన్‌సీ, పైబర్, విటమిన్ బీ6 అధికంగా ఉంటాయి.
- దీని వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
- వెల్లుల్లి తినడం వల్ల అల్లీసిస్, యాంటి ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. దీని వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
- టమాటా.. పోటాషియం, విటమిన్ సీ, బీటా కెరోటిన్, టైప్ 2 డయాబెటిస్, ఫొలేట్ అధికంగా ఉంటాయి.
- ఆహారంలో టమాటాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా దోహదపడుతుంది జట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు వంట చేసుకుని తినడం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతం ఈ బీజీ లైఫ్‌లో చాలా మంది ఉదయం వండిన ఆహార పదార్థాలను సాయంత్రం, రాత్రి వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా అన్నాన్ని వేడి చేయడం కారణంగా బియ్యంలో ఉండే బాసిల్లాస్ సెరియస్ అనే బాక్టీరియా వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తాజాగా తెచ్చిన కూరగాయాలు, ఆకుకూరలతో వంట చేసుకుని తినడం మంచిది.
this web site is very useful for this genaration and we have know all about diseases and it’s cure
Good article. use full information try to write 👏more information about health