Solve the Grey Hair problems this tips- తెల్ల జుట్టు సమస్యను తగ్గించండిలా..!
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య బాగా జుట్టు రాలడం, Solve the Grey Hair problems this tips రెండోది తెల్లజుట్టు. చాలా మంది యువత చిన్న వయస్సులోనే ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు బయట దుకాణాల్లో దొరికే రసాయనాలతో చేసిన హెయిర్ క్రిములు, ప్రోడక్టులు కొనేస్తారు. వాటి వల్ల ఇంకా సమస్య పెద్దదవుతుంది. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Solve the Grey Hair problems this tips
తెల్లజుట్టు రావడానికి కారణం : Causes of grey hair :
తలలో పేనుకొరుకుడు సమస్య తీవ్రమవుతున్నప్పుడు, థైరాయిడ్ ఎక్కువవుతున్నప్పుడు కూడా తెల్లజుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి.
నలుపు రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. దాంతో చిన్న వయసులోనే తల నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా వాడొద్దు.
హెయిర్ ప్రొడక్ట్స్ లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు ఇచ్చినా.. జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడుకోవాలి.
ఐరన్, కాపర్, విటమిన్ బీ12 లోపంతో తెల్లజుట్టు సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఎక్కువ ఒత్తిడితో జుట్టుపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో అనేక సమస్యలు వస్తాయి. క్రమంగా తెల్ల జుట్టు నల్లబడుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ ధ్యానం చేయాలి. సరిగా నిద్రపోవాలి.
Solve the Grey Hair problems this tips
బియ్యం నీళ్లు – Rice water :
బియ్యం కడిగిన నీళ్లు, ఆముదం కలిపిన మిశ్రమంతో తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. బియ్యం నీటిలో ఉండే బి, సీ, ఇ, కె విటమిన్లు జుట్టు నల్లబడటంలో సహాయపడతాయి.
వీటిలో ఉండే అమైనో ఆసిడ్స్, యాంటీ ఆక్సీడెంట్లు జుట్టు రాలడం, దురద, చుండ్రు సమస్యను తగ్గించడంతో సహాయపడతాయి.
ఉల్లిపాయలు – Onions :
తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయల రసాన్ని వారానికి రెండుసార్లు జుట్టుకు పట్టిస్తే సమస్య తగ్గుతుంది. ఉల్లిపాయల రసంలో ఉంటే సల్ఫర్, యాంటీ ఆక్సీడెంట్లు, యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తాయి.
పెరుగు, కరివేపాకు – Curd and curry leafs :
కరివేపాకు జుట్టు పెరుగుదలకు గొప్ప ఔషదం. కరివేపాకులో ఐరన్, జింక్, మాంగనీస్, విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-బి12 పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
పెరుగులో కరివేపాకు కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే సమస్య తగ్గుతుంది.
జామకాయ- Guava
జామకాయ, మెంతి గింజలు, బ్లాక్ టీ, బాదం నూనె, నిమ్మరసం, హెన్నా, కాఫీ, కరివేపాకు వంటి పదార్థాలు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఉపయోగపడతాయి.
జుట్టుకు నలుపు రంగును ఇచ్చే మెలనిన్ లేకపోవడమే తెల్ల జుట్టుకు ప్రధాన కారణం.
కళ్ల కింద నల్లటి వలయాలా.. ఈ టిప్స్‌తో తగ్గించుకోండి!
వేప – Neem :
తెల్ల జుట్టు సమస్యకు కారణం శరీరంలోని వేడి. వేపని వాడటం వల్ల జుట్టు సమస్యల్ని తగ్గిస్తుంది.
నల్లనువ్వులు – Black smiles:
నల్లనువ్వులు మెలనిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. మెలనిన్ జుట్టుకు నలుపు రంగును ఇస్తుంది.
నల్ల నువ్వులలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టును మెరుగుపరుస్తుంది. నువ్వుల చిక్కీ, నువ్వుల లడ్డు వంటివి రోజూ తింటూ ఉంటే తొందరలోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
నల్లనువ్వులలో కాల్షియం, ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ఎముక బలానికి, మహిళలలో నడుము బలంగా ఉండటానికి, రక్తహీనత సమస్యకు కూడా చక్కని పరిష్కారం.
ఉసిరికాయ – Amla
ఉసిరికాయను ఆయుర్వేదంలో అమృత ఫలం అని అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. నెరిసిన జుట్టు నల్లగా మార్చడంలో ఉసిరి సహాయపడుతుంది.
ఉసిరికాయను పచ్చిగా తినడం లేదా జ్యూస్, లేదా క్యాండీ చేసుకుని తినవచ్చు. సంవత్సరమంతా నిల్వ ఉంచుకోవడానికి ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసి నిల్వచేసుకుని రోజూ తీసుకోవచ్చు.
నల్ల ఎండుద్రాక్ష-Black raisins
నల్ల ఎండుద్రాక్షలో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలను గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. చిన్నవయసులో జుట్టు నెరిసిపోవడాన్ని నివారిస్తుంది.
రోజూ కొన్ని నానబెట్టిన లేదా నల్ల ఎండుద్రాక్ష లేదా తాజా నల్ల ద్రాక్ష తింటే జుట్టు నల్లగా మారుతుంది.
గుంటగలగరాకు- bhringraj leafs
ఇది తెల్ల జుట్టు సమస్యకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఆకులను పొడిగా చేసి హెయిర్ ప్యాక్, నూనెలో కలిపి రాయండి.
ఇది స్కాల్ప్‌కి మంచి పోషణని అందిస్తుంది. జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. దీనిని వాడడం వల్ల హెయిర్ ఫోలికల్స్ పెరుగుతాయి.
నువ్వుల నూనె – sesame oil :
నువ్వుల నూనెలో శరీరానికి అవసరమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ కూడా ఉంటుంది.
దీనిని గోరువెచ్చగా చేసి తలకి అప్లై చేసి మసాజ్ చేస్తే శరీరంలోని వేడి తగ్గి జుట్టు నెరసిపోకుండా ఉంటుంది. దీని వల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది.
కొబ్బరినూనె, నిమ్మ – Coconut oil and lemon :
కొబ్బరినూనె రాసుకోవడం వల్ల జుట్టుకి పోషణ అందుతుంది. తలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి జుట్టుకి రాసి అరగంట తర్వాత తలస్నానం చేయండి.
హెన్నా.. – Henna :
తెల్ల జుట్టుని తగ్గించేందుకు హెన్నా వాడొచ్చు. ఇందుకోసం టీ డికాషన్‌లో హెన్నా కలిపి 8 గంటలు నానబెడితే తలకి రాస్తే శరీరంలో వేడి తగ్గుతుంది. దీంతో క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది
మెంతి- fenugreek
మెంతి గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ కె మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి మరియు ఖనిజాల పవర్‌హౌస్‌గా ఉంటాయి. ఈ పోషకాలు స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంచుతాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.