Follow these tips for control Hair fall..! జుట్టు బాగా రాలుతోందా.. ఈ టిప్స్ పాటించండి..! Follow these tips for control Hair fall..!

జుట్టు బాగా రాలుతోందా.. ఈ టిప్స్ పాటించండి..! Follow these tips for control Hair fall..!

Follow these tips for control Hair fall..!

జుట్టు రాల‌డం.. ప్ర‌స్తుత స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొంటున్న స‌మ‌స్య ఇది. Follow these tips for control Hair fall..! ఈ స‌మ‌స్య‌తో బాధప‌డేవారిలో ఎక్కువ మంది యువ‌తీయువ‌కులే ఉన్నారు. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి నిత్యం ఏవో చిట్కాలు పాటిస్తూ ఉన్నా జుట్టు రాలడం ఆగడం లేదు అని బాధ పడుతుంటారు.

అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు మారిన ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవితాలు, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యం తదితర కారణాలతో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈస‌మ‌స్య‌తో మ‌రింత‌ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉన్న కాస్త‌ జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. ఇలా జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పోషకాహారం: Food

జుట్టు ఒత్తుగా అందంగా ఉండాలంటే.. శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. కాబట్టి.. శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయో లేదో గమనించండి.

మాంసం, చేపలు, నట్స్, పచ్చని ఆకు కూరలు వంటి ఆహారాన్ని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోండి.

దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ జుట్టుకు కూడా భద్రత లభించవచ్చు.

2. పొగ తాగ‌డం వద్దు: Avoid Smoking

చెడు వ్యసనాలు ఆరోగ్యానికి చేటు. పొగ తాగే అలవాటు ఉన్నట్లయితే తప్పకుండా మానేయండి.

పొగతాగేవారిలో జుట్టు కుదుళ్లలోని డీఎన్ఏను నాశనం చేసి జుట్టు ఎదగకుండా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

కాబట్టి.. స్మోకింగ్‌‌కు దూరంగా ఉండి మీ జుట్టును రక్షించుకోండి.

3. త‌ల‌పై టోపీ పెట్టుకోండి: Wear Head cap

చాలామంది టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని భావిస్తారు. కానీ, ఎండలోకి వెళ్లేప్పుడు టోపీ పెట్టుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే.. అది జుట్టును యూవీ రేస్ నుంచి నుంచి రక్షిస్తాయి.

యూవీ రేస్ కూడా నుంచి వెలువడే రేడియేషన్ కూడా జుట్టుకు హానికరమని పరిశోధనల్లో తేలింది.

అవి తలలోని ప్రోటీన్లకు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది.

Follow these tips for control Hair fall..!

4. ఒత్తిడి దూరం చేసుకోండి: Avoid Stress

ఒత్తిడి వల్ల అనారోగ్యాలు త్వరగా దాడి చేస్తాయి. అంతేకాదు.. జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణం ఒత్తిడే. ఒత్తిడి వల్ల జుట్టు రాలడమే కాకుండా హెయిర్ గ్రోత్ సైకిల్‌కు ఆటంకంగా మారుతుంది.

కాబట్టి, రోజు వ్యాయామం లేదా యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కంటి నిండా నిద్రపోండి.

5. సరైన నిద్ర: Proper Sleep

హెయిర్ ప్రాబ్లమ్స్​తో ఇబ్బంది పడుతున్నట్లయితే రోజూ తగినంత నిద్ర పోయేలా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నిద్రలేమి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.

కాబట్టి డైలీ ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ఇక ఇవన్నీ ఫాలో అయినా జుట్టు విపరీతంగా ఊడుతున్నట్లయితే సంబంధిత వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

6. త‌ప్ప‌నిస‌రిగా వ్యాయామం చేయాలి: Daily Exercise

శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసమే కాదు. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం పొందాలన్నా రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

అలా చేయడం ద్వారా నెత్తి మీద చర్మంతో సహా జుట్టు మూలాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అది జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన స్కాల్ప్​ను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

Why morning walk Is good for health? ఆరోగ్యానికి ఉద‌య‌పు న‌డ‌క మంచిదేనా? కాదా.. ఎందుకు?

7. తగినంత నీళ్లు తాగాలి: Drink Water

జుట్టు ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యానికి రోజూ తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే డీహైడ్రేషన్ సమస్య తలెత్తి అది ఆరోగ్యంపై మాత్రమే కాకుండా జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే డైలీ తగిన మొత్తంలో వాటర్ తాగాలి.

8. నూనె : oil 

చాలామంది తలకు నూనె రాయటానికి ప్రాధాన్యత ఇవ్వరు. మీకు నచ్చిన ఏదో ఒక నూనెను పూయటం చాలా అవసరం. ఇలా చేస్తే బ్లడ్ సర్కులేషన్ పెరిగి, మీ జుట్టు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఇందుకు గోరువెచ్చని నూనె కూడా మసాజ్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఇలా మసాజ్ చేశాక ఓ వెచ్చని టవల్ తో కొన్ని నిమిషాలపాటు తలకు అలాగే చుట్టుకోండి. దీంతో మీ జుట్టుకు ఎక్స్ ట్రా కండిషనింగ్ వస్తుంది.

9.రోజూ తలస్నానం వద్దు: Avoid Daily Bathing

కొందరు తలస్నానం చేయకుండా బయటికి కాలు పెట్టరు. కానీ రోజూ తలస్నానం చేస్తే జుట్టుకు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ. అది కూడా నూనె రాయకుండా తలస్నానం అస్సలు చేయద్దు.

ఇక షాంపుల్లోని రసాయనాల వల్ల కురులకు ప్రమాదం ఎక్కువ. అందుకే రోజూ షాంపుతో తలస్నానం చేయకండి.

10. ఉసిరి : Amla

అన్ని రకాల జుట్టు సమస్యలకు ఉసిరి కాయలు చక్కని విరుగుడు. తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా, పొడవుగా, నిగారింపు సంతరించుకునేలా జుట్టుకు అవసరమైన పోషణ ఇచ్చే ఆమ్లా కుదుళ్లను గట్టిపరుస్తుంది.

పరగడపున రోజూ ఉసిరికాయలు తినండి. అదేంటి ఏడాదిపొడవునా ఇవి దొరకవు కదా అనుకోకండి,

ఎండబెట్టిన ఉసిరి ముక్కలు, లేదా ఉసిరి మురబ్బా వంటివి  నిల్వచేసుకుని క్రమం తప్పకుండా తినండి. లేదా ఉసిరికాయ ఊరగాయను తినండి.

సీ విటమిన్ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, సోడియం, మ్యాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో మీ జుట్టు ఆరోగ్యం మరింత పెరుగుతుంది.

11. క‌ల‌బంద : Aloevera

కలబందతో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా మీ కురులకు కలబంద జెల్ అప్లై చేసినప్పుడు అవి పట్టులా మెరిస్తాయి. జుట్టు రాలకుండా ఉండేందుకు కలబంద చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

తలలో తేమను, పోషకాలను పెంచేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అలోవెరాను రాసి ఓ గంటపాటు వదిలేశాక తలస్నానం చేయండి.

క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

12. మెంతులతో.. : Methi

జుట్టు రాలకుండా ఉండాలి అంటే మెంతులు వాడితే సరి. దీంతో జుట్టు పొడిబారడం ( Dry Hair ),చుండ్రు వంటి సమస్యలు తొలగిపోతాయి.

మెంతులను పెరుగులను నానబెట్టి ఉదయాన్నే తలపై అప్లై చేయాలి. అరగంట తరువాత కడిగేయాలి.

 

 

 

1 thought on “Follow these tips for control Hair fall..! జుట్టు బాగా రాలుతోందా.. ఈ టిప్స్ పాటించండి..! Follow these tips for control Hair fall..!”

Leave a Comment