టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లి Anushka shared photo of Vamika and Akai on Kohli’s birthday తన 36వ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ .. సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడు అకాయ్, కుమార్తె వామికలను ఎత్తుకున్న ఉన్న కోహ్లీ ఫొటోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామంలో పోస్టు చేశారు. ఆ పోస్టు కాస్తా వైరల్ అయ్యింది. తొలిసారి తమ పిల్లల ఫొటోలను రివిల్ చేశారు. కానీ వారి ముఖాలు కనిపించకుండా లవ్ ఎమోజీలతో కవర్ చేశారు. అయినప్పటికీ కోహ్లీ ఫ్యాన్స్ ఫిదా అవుతూ శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులు నెలకొల్పారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(50) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నారు.
బెల్లీ ప్యాట్‌ను తగ్గించే ఆసనాలు ఇవే..!
2017 డిసెంబర్ 11న విరాట్, అనుష్క శర్మల వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతులకు 2021లో తొలిసంతానం కుమార్తె వామిక , 2024 ఫిబ్రవరిలో రెండో సంతానం కుమారుడి అకాయ్ జన్మించారు.