Ghee Is good for health? What are the benefits?నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిదేనా? ఉప‌యోగాలు ఏమిటి?

Ghee Is good for health? What are the benefits?నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిదేనా? ఉప‌యోగాలు ఏమిటి?

Ghee Is good for health? What are the benefits?

నెయ్యి అంటే కొంత‌మంది  ఇష్టంగా తింటారు. Ghee Is good for health? What are the benefits? మ‌రికొంద‌రు దాని ఉపయోగాలు తెలియ‌క ఇష్ట‌ప‌డ‌రు.

ఇది తింటే కొలెస్ట్రాల్ పెరుగతుందేన‌ని భ‌య‌ప‌డుతుంటారు. కొంద‌రు డైట్ చేస్తున్నాం అంటూ తిన‌డం మానేస్తారు. నిజానికి నెయ్యి తిన‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే నెయ్యి Ghee Is good for health? What are the benefits? రుచి, వాసనను పెంచడమే కాకుండా.. ఈ నెయ్యి తిన‌డం వ‌ల్ల‌ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి.

అందుకే మ‌న‌దేశంలో నెయ్యి తినే పద్ధతి పూర్వం నుంచే కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు. మ‌న రోజూవారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి కూడా తీసుకోవాలి.

Ghee Is good for health? What are the benefits?నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిదేనా? ఉప‌యోగాలు ఏమిటి?

నెయ్యిలో ఎ, డి, ఇ, కె వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.

ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తాయట. అలాగే.. ప్ర‌తి రోజూ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని నరాల పనితీరు మెరుగుపడుతుందంటున్నారు.

చలికాలంలో, వర్షాకాలంలో, వేసవిలో తినవచ్చు. వేసవిలో మాత్రం కాస్త మితంగా వాడాలి. ఎందుకంటే నెయ్యి స్వభావం వేడి చేసేది కావడంతో ఎండాకాలంలో తక్కువగా తీసుకుంటే మంచిది.

విటమిన్ ఇ పుష్కలంగా ఉండే నెయ్యి తినడం వల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్, ఆర్ధరైటిస్ సమస్యల్ని తగ్గిస్తాయి.

నెయ్యి తిన‌డం వల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు – Health Benefits of Eating Ghee

రోగనిరోధక శక్తిని పెంచుతుంది :  Immunity Increases
నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఎంతగానో సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తి పెంచడంలో కీలక పాత్ర: Key role in Memory
నెయ్యి తినడం వల్ల మన జీర్ణ శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది.
నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు, కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది.
నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా, చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

ghee26092024weightloss

బరువు తగ్గించుకునేందుకు.. : To lose weight
అలాగే, నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది :Improves digestive system

రోజూ ఉదయం పరగడుపున ఒక టేబుల్​స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇది ఆహారం సులభంగా అరగడానికి దోహదపడుతుందని చెబుతున్నారు.

మలబద్ధకాన్ని పోగొడుతుంది : Relieves Constipation
మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్న వారు రోజూ ఉదయం ఖాళీ కడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాగే మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మెదడుకు మేలు : benefit to brain

నెయ్యిలోని కొవ్వులు మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. అవి మెదడు కణాల అభివృద్ధికి, నిర్వహణకు అవసరమైన పోషకాలను అందిస్తాయంటున్నారు.

కాబట్టి  రోజు పరిగడుపున నెయ్యి తీసుకోవడం ప్రారంభిస్తే అది మెదడు పనితీరును మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు.

హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది :  hormone Balancing

పరగడుపున నెయ్యి తీసుకోవడం హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హార్మోన్ల సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

ఎముకలు దృఢంగా : Bones are strong

ఉద‌యం ఖాళీ కడుపుతో చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎముక మజ్జ బలంగా మారుతుందని.. శరీరంలోని బోన్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు.

గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది: Supports heart health
నెయ్యిలో కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ మోనోఅన్‌శాచురేటెడ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు గుండె , రక్త ధమనులను మంచి స్థితిలో ఉంచుతాయి.
నెయ్యిని సమతుల్య ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:Improves skin health
నెయ్యి ప్రతికూల ప్రభావాలు లేకుండా చౌకైన చర్మ సంరక్షణ నివారణ. సహజ మాయిశ్చరైజర్ అయిన నెయ్యి చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ గా ఉంచుతుంది. కొవ్వు ఆమ్లాలు చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి, అది మెరుస్తుంది.
అరచేతికి కొన్ని చుక్కల నెయ్యిని అప్లై చేసి, మీ చేతులు మరియు ముఖం మీద వృత్తాకార కదలికలో రుద్దండి. రాత్రిపూట వదిలిన తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
వ‌ర్షాకాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివి!

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: Improves hair health:
జుట్టు అభివృద్ధిని ప్రోత్సహించే నెయ్యి యొక్క సంభావ్యత చాలా ముఖ్యమైన జుట్టు ప్రోత్సాహకాలలో ఒకటి. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ మరియు కె పుష్కలంగా ఉన్నాయి.
అలాగే జుట్టు పెరుగుదలకు తోడ్పడే , ప్రోత్సహించే మంచి కొవ్వు ఆమ్లాలు. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచేటప్పుడు జుట్టు రాలడాన్ని నివారించ‌డానికి నెయ్యిని త‌ల‌, జుట్టుకు మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చు.
కాలిన గాయాలకు చికిత్స చేస్తుంది: Treats Burns:
నెయ్యి దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో వైద్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. చిన్న, కాలిన గాయాలకు ఉపశమనం క‌లిగిస్తుంది. ఇది వాపు, కాలిన గాయాలకు కూడా బాగా ప‌నిచేసే ఇంటి చికిత్స.
రుతుక్రమ సమస్యలకు చికిత్స చేస్తుంది: Treats Menstrual Problems
నెయ్యి తిమ్మిరి, పీఎంఎస్‌రుతుక్రమ సమస్యలకు చికిత్స చేస్తుంది. వికారం తగ్గించి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఇది అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు,గర్భాశయ కండరాలకు కూడా పోషణను అందిస్తుంది.
ప్రతి రోజు భోజనంలో ఒక టీస్పూన్ స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రాంప్స్ వచ్చే అవకాశం తగ్గుతుందంటున్నారు.

Leave a Comment