మ‌ధుమేహులూ కాఫీ తాగొచ్చా?- Diabetics  Can  drink coffee?

మ‌ధుమేహులూ కాఫీ తాగొచ్చా?- Diabetics  Can  drink coffee?

ర‌క్తంలో చ‌క్కెర స్థాయి అధిక‌మైన‌ప్పుడు ఈ వ్యాధి మ‌ధుమేహులూ కాఫీ తాగొచ్చా?- Diabetics  Can  drink coffee?  ల‌క్ష‌ణాలు క‌న్పిస్తాయి.

కాబ‌ట్టి చ‌క్కెర వ్యాధి వ‌చ్చిందంటే అనేక అనారోగ్యాలు ఒక‌దాని వెంట మ‌రొక‌టి వ‌చ్చి శ‌రీరాన్ని గ‌ల్ల చేస్తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయికి మించి పెరిగిపోతే శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌పై ప్ర‌భావం చూపిస్తుంది.

మ‌ధుమేహులూ కాఫీ తాగొచ్చా?- Diabetics  Can  drink coffee?

మ‌ధుమేహం రెండు ర‌కాలు – Diabetes Two Types
1.టైప్ 1 మ‌ధుమేహం- Type 1 Diabetes
2.టైప్ 2 మ‌ధుమేహం – Type 2 Diabetes

టైప్ 2 మ‌ధుమేహం రాకుండా అదుపులో ఉంచ‌డం మ‌న చేతుల్లోనే ఉంటుంది. ఇది ఎక్కువ‌గా పెద్ద‌వారిలో ఉంటుంది.

క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను త‌గినంత ఉత్ప‌త్తి చేయ‌క‌పోయినా ఇన్సులిన్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌క‌పోయినా డ‌యాబెటిస్ వ‌స్తుంది.

అయితే షుగర్‌ పేషెంట్స్‌ ఏ డౌట్‌ లేకుండా ప్రతి రోజూ కాఫీ తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. NCBI నివేదిక ప్రకారం ప్రతి రోజూ కాఫీ తాగితే.. టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ముప్పు తగ్గుతుంది.

పాలతో చేసిన కాఫీ కంటే.. బ్లాక్‌ కాఫీ తాగితే, రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా పెంచదు. డయాబెటిక్స్‌ డికెఫినేడెట్‌ కాఫీ తాగితే మంచిదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేయకుండా, శరీరారనికి మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ అందిస్తుందని చెబుతున్నారు.

 

మ‌ధుమేహానికి కాఫీతో చెక్ .. ఎలాగంటే..?

కాఫీలో కెఫిన్ ఎక్కువ‌గా గ‌ల వారికి టైప్ 2 మ‌ధుమేహం ముప్పు త‌క్కువ‌గా ఉంటున్న‌ట్లు యూరప్ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఇది బ‌రువును త‌గ్గించ‌డం ద్వారా మ‌ధుమేహం ముప్పును త‌గ్గేలా చూస్తున‌ట్లు పేర్కొంది.

ఇందులో కెఫిన్‌తో కూడిన పానీయాల వినియోగం క‌న్నా శ‌రీరంలో కెఫిన్ ఎలా విచ్ఛిన్నమ‌వుతోంద‌నే అనే దాని మీదే ఎక్కువ‌గా దృష్టి సారించ‌డం విశేషం.

కెఫిన్ జీవ క్రియ త‌క్కువ‌గా గ‌ల వారిలో ఇది విచ్ఛిన్నం కావ‌డానికి ఎక్కువ సమ‌యం ప‌డుతోంద‌ని, అందువ‌ల్ల రక్తంలో దీని మోతాదు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వైద్య నిపుణులు గుర్తించారు.

కెఫిన్ వాడ‌కానికి బ‌రువు త‌గ్గ‌డానికి మ‌ధ్య సంబంధం ఉన్న‌ట్లు చాలా కాలంగా తెలిసిందే. అందుకే బ‌రువు త‌గ్గించే మాత్ర‌ల్లో విధిగా కెఫిన్‌ను చేర్చుతుంటారు కూడా. ఇది శ‌రీరం ఎక్కువ శ‌క్తిని ఖ‌ర్చు చేసుకునేలా దోహ‌ద‌ప‌డుతుంది.

ఇలా బ‌రువు త‌గ్గ‌డానికి తోడ్ప‌డుతుంది. బ‌రువు త‌గ్గితే మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు, ప‌క్ష‌వాతం వంటి స‌మ‌స్య‌ల ముప్పూ త‌గ్గుతుంది.

కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం ద్వారా మ‌ధుమేహాన్ని నివారించుకోవచ్చా?

తాజా అధ్య‌య‌నం కాఫీ వినియోగానికి బదులు ర‌క్తంలో కెఫిన్ మోతాదుల గురించే చెబుతుంద‌ని గుర్తించాలి. పైగా ఇవి రెండూ జ‌న్యువుల‌తో ముడిప‌డి ఉండ‌టం గ‌మ‌నార్హం.

వ‌ర్షాకాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివి!

43 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా..

శ‌రీరంలో కెఫిన్ జీవ క్రియ‌లు వేగ‌వంతం కావ‌డంలో సీవైపీ1ఏ2, ఏహెచ్ఆర్ జ‌న్యువులు పాలు పంచుకున్న‌ట్లు గుర్తించాలి.

ఈ జ‌న్యువులు గ‌ల వారిలో కెఫిన్ జీవ క్రియ నెమ్మ‌దిగా సాగుతోంద‌ని, స‌గ‌టున త‌క్కువ కాఫీ తీసుకున్నా ర‌క్తంలో కెఫిన్ మోతాదులు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

ఇది బ‌రువు త‌గ్గ‌డానికి తోడ్ప‌డుతుంద‌ని, ఫ‌లితంగా మ‌ధుమేహం ముప్పు 43 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉంటుంద‌ని వివ‌రిస్తున్నారు. అంటే కెఫిన్ జీవక్రియ నెమ్మ‌దిగా సాగే స్వ‌భావం గ‌ల వారు త‌క్కువ కెఫిన్ తీసుకున్నా దీని ప్ర‌యోజ‌నం ఎక్కువ‌గా ఉంటుంద‌న్న‌మాట‌.

అంతే త‌ప్ప కాఫీ ఎక్కువ తాగితే మ‌రింత ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అధ్య‌య‌నం సూచించ‌డం లేదు. కాఫీ మితిమీరితే గుండె వేగం పెర‌గ‌డం, ఆందోళ‌న‌, చిరాకు, చేతులు వ‌ణ‌కు, నిద్ర‌లేమి, త‌ల‌నొప్పి వంటి ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌కూ దారి తీస్తుంది. అంతేకాదు కాఫీతోపాటు చ‌క్కెర కూడా తీసుకోవ‌డం వ‌ల్ల మేలు క‌న్నా కీడే ఎక్కువ‌ జ‌రుగుతుంది.

టైప్ 2 డయాబెటిస్ ప్ర‌మాద కార‌కాలు :

బ‌రువు  – Weight

ఓవర్ వెయిట్ అనేది టైప్ 2 డయాబెటిస్ బారిన పడేసే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఐతే, కొన్నిసార్లు ఓవర్ వెయిట్ గా లేకపోయిన వారు కూడా టైప్ 2 డయాబెటిస్ బారిన పడినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

కొవ్వు – Fat

శరీరంలో కొవ్వు ఎక్కడ స్టోర్ అవుతోంది అన్న విషయం కూడా టైప్ 2 డయాబెటిస్ రిస్క్ శాతాన్ని డిసైడ్ చేస్తుంది. హిప్స్ అలాగే థైస్ లో కాకుండా అబ్డోమెన్ లో ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అయితే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఎక్కువ.

Why does heartache occur? What are the causes and mitigation measures?

ఫిజికల్ యాక్టివిటీ – Physical activity

ఫిజికల్ యాక్టివిటీ వల్ల‌ ఎన్నో హెల్త్ రిస్కులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఫ్యాక్టర్ ను కూడా తగ్గించవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మాత్రం ఈ రిస్క్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువే.

వ‌యసు –  Age

టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ఫ్యాక్టర్ ను ఏజ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 45 ఇయర్స్ దాటిన వారిలో రిస్క్ ఎక్కువ. ఐతే, ఈ మధ్యకాలంలో అంతకంటే చిన్నవారిలో ముఖ్యంగా పిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది..

ప్రీడయాబెటిస్-Prediabetes

బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఐతే డయాబెటిస్ అని డిసైడ్ చేసేంత రేంజ్ లో లేనప్పుడు ఆ కండిషన్‌ను ప్రీడయాబెటీస్ అనంటారు. ఈ కండిషన్‌ను ట్రీట్ చేయకపోతే టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు.
కాబట్టి, ఆరోగ్యాన్ని కేర్ తీసుకుంటూ క‌ప్పు కాఫీని అదనంగా తీసుకుంటే టైప్ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయంటున్నారు నిపుణులు.

గ్యాస్ట్రిక్, గుండె నొప్పికి తేడా ఏమిటి? గుర్తించ‌డ‌మేలా?

కాఫీ వల్ల కొన్ని ప్రయోజనాలు:

Diabetics  Can  drink coffee

మ‌ధుమేహూల్లో కాఫీ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాఫీ తాగడం వల్ల షుగర్ ముప్పు తగ్గుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే పరిమిత పరిమాణంలో మాత్రమే కాఫీని తీసుకోవాలి. మితమైన స్థాయిలో మాత్రమే కాఫీ తాగాలి. కెఫిన్‌తో ఇన్సులిన్ సెన్సిటివిటీ మంచిదని అనేక పరిశోధనలలో పేర్కొంది.

కాఫీ తాగడం వల్ల కలిగే హాని ఏమిటి:

*కాఫీలో ఉండే కెఫిన్ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
*షుగర్ టైప్ 1 , 2 ప్రమాదాన్ని పెంచుతుంది.
*బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండని వ్యక్తులు కాఫీ తాగకుండా ఉండాలి.
*షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా కాఫీ తాగడం వల్ల అధిక బీపీ సమస్య ఉంటుంది.
*ఖాళీ కడుపుతో కాఫీ తాగడం రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
*ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
*కాఫీ తాగాలనుకుంటే, అల్పాహారం తర్వాత తాగ‌వ‌చ్చు., ఇది హానిని తగ్గిస్తుంది.
*మ‌ధుమేహులు పరిమిత పరిమాణంలో కాఫీ తీసుకోవాలి.

Leave a Comment