వానాకాలం మొదలైంది. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. The problems in rainy season to be take precautions వేడి వాతావరణం, ఉక్క పోత, భయంకరమైన ఉష్ణోగ్రతల్ని దాటుకుని కాస్తా ఉపశమనం పొందాలి అనుకుంటాం.
ఇది మనసుకి కాస్తా హాయిగా అనిపించినా ఆరోగ్యానికి హాని చేస్తుంది. దీని కారణంగా ఇమ్యూనిటీ బలహీనపడుతుంంది. దీంతో ఈ సీజన్‌లో అంటువ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.
సీజనల్ వ్యాధులు-Seasonal Diseases
వ్యాధుల సీజన్(Seasonal Diseases) ఇప్పుడే మొదలైంది. వర్షాలు కురుస్తుండడంతో జబ్బులు కూడా ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా కలుషిత నీరు, ఆహారం వల్ల టైఫాయిడ్, జిగట విరేచనాలు, నీళ్ల విరేచనాలు(డయేరియా) వంటివి ప్రబలుతున్నాయి. టైఫాయిడ్, జిగట, నీళ్ల విరేచనాలు, డయేరియా కేసులు ఎక్కువగా ఉన్నాయి
వాతావరణం మారడం వల్ల.. -climate change.. :
వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటంటే..
జలుబు, జ్వరం – Fiver, Cold
ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వ సాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం. కాబట్టి, వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
దోమలు.. – Mosquitos:
రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. దీని వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి.
డెంగ్యూ.. – Dengue :
డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యే.. ఇది ప్రాణాంతకంగా మారింది. ఇది డెంగ్యూ వైరస్ కారణంగా వ్యాప్తి చెందుతుంది.
కలరా.. – Cholera :
కలరా అనేది కలుషిత నీటి ద్వారా వచ్చే సమస్య. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది.
టైఫాయిడ్.. Typhoid :
టైఫాయిడ్ జ్వరం కూడా కలుషిత ఆహారం, నీటి కారణంగా వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ వల్ల వచ్చే మరో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. తీవ్ర జ్వరం, తలనొప్పి వాంతులు, కడుపులో నొప్పి, విరేచనాలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు.
హెపటైటిస్.. – Hypatities :
కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకడం, కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. ఈ సమస్య లక్షణాలు జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైనవి వస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.
సురక్షితమైన నీటినే తాగాలి- Drink purified water :
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు కలుషితం అయ్యే అవకాశాలు అధికం. వరదల ధాటికి తాగునీటి పైపు లైన్ల దెబ్బతిని మురుగునీరు, కలుషితాలు అందులో కలుస్తాయి.
ఈ కారణంగా డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు విస్తరిస్తాయి. కాబట్టి కొంత కాలం పాటు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలి. ప్రజలు ఇళ్లలో ఉండే నీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. కారణాలివే?
శ్వాస కోశ సంబంధిత సమస్యల తీవ్రత- Severity of respiratory problems :
వర్షాకాలంలో కొన్ని బ్యాక్టీరియాలు , వైరస్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి జలుబు, నిమోనియా, బ్రాంకైటిస్, ఫ్లూ వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో శ్వాసకోశ సంబధిత వ్యాధులకు అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. జ్వరం, దగ్గు, తుమ్ములు, ఆయాసం, ఉంటే జాగ్రత్తలు పాటించి వైద్యం చేయించుకోవాలి.
ఈ సీజన్‌లో ఆస్తమా కూడా ఎక్కువ అవుతుంది. శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి, ఉపయోగించే మందుల డోసులను సరిచేసుకోవాలి.
చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు అవకాశం- Possibility of skin related infections :
వర్షాకాలం ఎక్కువ సేపు నీళ్లలో ఉంటే కాళ్లకు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రైతులు వరద, బురదలో ఎక్కువ సేపు ఉండటంతో కాళ్ల వేళ్ల మధ్య ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. యాంటీ ఫంగల్ క్రీములు వాడటంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రధానంగా మధుమేహులు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని చర్మ వ్యాధులు, అలర్జీలు ఎక్కువగా ఉంటాయి. కొందరికి రుమటాయిడ్ అర్థ్రటైటీ కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి.
గ్యాస్ట్రిక్, గుండె నొప్పికి తేడా ఏమిటి? గుర్తించడమేలా?
ఎందుకు ప్రమాదం?- Why danger :
కొత్త నీరు వచ్చి పాత నీరు వెళ్లే క్రమంలో కలుషితమవడానికి అవకాశాలెక్కువ. అందులోనూ వరద కారణంగా తాగునీటి పైపులైన్లలో లీకేజీ ఏర్పడి కలుషితానికి ఆస్కారం ఉంటుంది.
ఈ సమయంలో తాగునీటి ట్యాంకులను బాగా కడుక్కోకపోతే అపరిశుభ్రతకు దారితీస్తుంది. అలాగే ఈ కాలంలో తినేపదార్థాలపై ఈగలు ముసురుకుంటాయి.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తాగునీరు, ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆహారాన్ని తీసుకోవడం, స్వచ్ఛమైన నీటిని తాగడం మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
*వర్షాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.
*పోషకాహారం తీసుకోవాలి.
*ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.
*కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
*దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.
*దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.
*అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.