What is the difference between gastric and heart pain? Identify? –గ్యాస్ట్రిక్, గుండె నొప్పికి తేడా ఏమిటి? గుర్తించడమేలా?
ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. What is the difference between gastric and heart pain? Identify? అయితే ఇలా మరణించేవారిలో చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ప్రధానంగా వారు గుండెపోటుకు, గ్యాస్ నొప్పికి మధ్య ఉన్న తేడాను గమనించలేకపోతున్నారు. మారిన జీవన విధానం వల్ల చాలా మందికి గ్యాస్, అజీర్తిలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది.
హెవీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు జీర్ణాశయంలోకి రసాలు గొంతులోకి వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు ఛాతలో మంట వస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కొన్ని సార్లు ఛాతీ మంట, గుండె పోటు రెండింటి లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి.
అందుకే చాలా మంది ఛాతీలో మంట వచ్చి గ్యాస్, గుండెపోటు వల్లనో కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా తరచుగా వచ్చే ఛాతీ మంటలు ప్రమాదకరం కాదు. అసలు ఈ ఛాతీ మంటలు ఎందుకు వస్తాయి? ఏ సమస్యలతో వస్తాయో తెలుసుకుందాం..
గుండె నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
అసలు ఛాతీ మంటలు ఎందుకు వస్తాయి?
పెప్టిక్ అలర్స్ : peptic ulcers
ఈ మధ్య కాలంలో చాలా మంది అలర్స్‌తో బాధపడుతున్నారు. అలర్స్ అనేది జీర్ణాశయంలోని చిన్న పేగు లోపలి ఉపరితలంపై వచ్చే పుండు. .జీర్ణాశయంలోకి పుండ్లు అయినప్పుడు అజీర్తి, కడుపులో మంటలు, వికారం, వాంతులు, రక్తస్రావం వస్తుంటాయి.
అలర్స్‌తో బాధపడే వారికి తరచూ ఛాతీలో మంట ఏర్పడుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారు వైద్యులను సంప్రదిస్తే సరైన మందులను సూచిస్తారు.
గుండె పోటు : heart attack
గుండె పోటు వచ్చే ముందు ఛాతీలో మంటలు వస్తాయి. దీంతో వారు అది సాధారణ ఎసీడీటీ మంటగానే భావిస్తారు. కడుపులో గ్యాస్ ఫాం అయినప్పుడు ఛాతీలో మంట వస్తుంది.
అదేవిధంగా నోరు చేదుగా మారుతుంది. కానీ గుండె జబ్బు వచ్చినప్పుడు కూడా ఛాతీలో మంట రావడం, ఒళ్లు బిగుతుగా మారడం, నొప్పి, అజీర్ణం, వికారణం, వేగవంతమైన హృదయ స్పందన, చర్మం బిగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల సమస్యలు : lungs problems
ఊపిరితిత్తుల్లోకి కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఛాతీ మంటతో బాధపడుతూ ఉంటారు. ఈ యాసిడ్స్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు న్యూమోనియా, శ్వాసలోపం, ఆస్తమా, లారింగైటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
యాసిడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప్పడు గొంతు నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఛాతీలో మంట వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
హెర్నియా : hernia
హెర్నియాతో బాధపడేవారికి ఛాతీలో మంట వస్తూ ఉంటుంది. కడుపులోని కాస్త భాగం దిగువున దూరినప్పుడు హెర్నియా వస్తుంది. దీనికి చికిత్స అందిస్తే త్వరలోనే కోలుకుంటారు. లేదా నిరంతరం ఛాతీలో మంటలు వచ్చి అన్నవాహికకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.
ఇలా దీర్ఘకాలంలో ఉంటే అది అన్నవాహిక క్యాన్సర్ లాగా మారే ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
క్యాన్సర్ : cancer
పేగు క్యాన్సర్‌తో బాధపడేవారు అధికంగా ఛాతీలో మంటలకు గురవుతూ ఉంటారు. క్యాన్సర్ వచ్చినప్పుడు అన్నవాహిక లైనింగ్‌కు ప్రభావితం అవుతుంది. దీంతో కడుపులోకి ఆహారం ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెర్సింస్టెంట్ పెఫ్టిక్ ఎసోఫాగిటిస్ అన్న వాహికల్లో ఇబ్బందులు కలిగిస్తాయి.
ఇది సాధారణ నొప్పే అనుకొని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి నొప్పి కొన్నిసార్లు గుండెపోటుకు కూడా దారి తీయవచ్చు.
గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ మధ్యలో నొప్పి ఎక్కువగా వస్తుంది. కొంతమందికి భుజాల నుంచి తల వరకు నొప్పి వస్తుంది. మరికొంత మందిలో తేన్పులు, ఆవలింతలు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గ్యాస్ నొప్పి వస్తే కనిపించే లక్షణాలు
- ఛాతిలో ఎడమ వైపు నొప్పిగా ఉంటుంది.
- కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
- సాధారణ లేదా పుల్లని త్రేన్పులు వస్తాయి.
- కడుపులో మంటగా ఉంటుంది. గుండెల్లో మంట వస్తుంది.
గుండెపోటు అంటే ఏమిటి?
కరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగా గుండెపోటు వస్తుంది. ఇందులో గుండెలోని సిరల్లోకి రక్తం చేరకపోవడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా ఆగిపోవడం కారణంగా గుండె పనితీరు మందగిస్తుంది. అది క్రమంగా పనిచేయడం ఆగిపోతుంది. గుండెపోటు అకస్మాత్తుగా వస్తుంది. దీని కారణంగా చాలాసార్లు వ్యక్తి కోలుకునే అవకాశం ఉండదు. దీనిని కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు.
గుండె నొప్పి వస్తే కనిపించే లక్షణాలు
- గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. ఛాతి మీద ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది.
- విపరీతమైన చెమట పడుతుంది.
- ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ ఉంటాయి.
- కొందరిలో విరేచనాలు అవుతాయి.
- కొందరికి వాంతులు అవుతాయి.
- ఎడమ వైపు దవడ నొప్పిగా ఉంటుంది. పట్టేసినట్లు అనిపిస్తుంది.
- ఛాతి మధ్య భాగం నుంచి నిలువుగా గడ్డం వరకు నొప్పి ఉంటుంది.
- కొందరికి ఛాతి మొత్తం నొప్పి ఉంటుంది.
- స్పృహ తప్పి పడిపోతారు.
ఇలా గ్యాస్ నొప్పి, గుండె నొప్పి లక్షణాలను గమనించవచ్చు. అయితే కొందరికి గ్యాస్ నొప్పి లక్షణాలతోనూ గుండె నొప్పి వస్తుంది. కనుక ఏ నొప్పి అయినా సరే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకైనా మంచిది పరీక్షలు చేయించుకుంటే మంచిది. సమస్య లేకపోతే సరే. కానీ ఉంటే మాత్రం పరీక్షల్లో తెలుస్తుంది. దీంతో గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.