Why does heartache occur? causes and mitigation measures? గుండె నొప్పి ఎందుకు వ‌స్తుంది? కారణాలు, త‌గ్గించేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి?

Why does heartache occur? causes and mitigation measures?

గుండె నొప్పి ఎందుకు వ‌స్తుంది? కారణాలు, త‌గ్గించేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి?

అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న స‌ర‌ళీ, ఆహార‌పు అల‌వాట్లు, వ్య‌వ‌స‌నాలు గుండెకు Why does heartache occur? స‌మ‌స్య‌ల తాకిడిని పెంచుతాయి. మాన‌సిక ఒత్తిడి కూడా మ‌రో స‌మ‌స్య‌గా మారుతోంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా గుండెపోటు వ‌స్తోంది.

వాతావ‌ర‌ణంలో మార్పులు, ఆహార‌పు అల‌వాట్లతో గుండె ప‌నితీరులో మార్పు వ‌స్తోంది. శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తూ ఓ కారణం కావచ్చు.

ర‌క్త‌నాళాలు స‌రిగా లేక‌పోయినా, ర‌క్త‌నాళాల్లో బ్లాకులు ఏర్ప‌డినా గుండెపోటు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Why does heartache occur? What are the causes and mitigation measures?

గుండె నొప్పికి అనేక కారణాలు : There are many causes of heart pain

ధూమపానం

గుండెపోటుకు గురవుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగవల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా, గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారుతాయి. ఫలితంగా రక్తపోటు అధికం అవుతుంది.

మంచి కొలెస్ట్రాల్‌ తగ్గిపోయి, చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. Why does heartache occur? రోగి పీల్చిన పొగ నేరుగా రక్త నాళాలను దెబ్బతీయడంతో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ధూమపానం చేసే వారికి గుండెపోటు వస్తే కనుక, మందులు కూడా పనిచేయవు.

ఇతరులు తాగిన పొగను పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్‌ 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. దీన్నే ‘పాసివ్‌ స్మోకింగ్‌’ అంటారు.

వంశ పారంపర్యం : Family tradition

 

వంశ పారంపర్యంగా గుండెపోటు వ‌చ్చే అవ‌కాశం ఉంది. తండ్రికి 55ఏళ్ల లోపు.. తల్లికి 65 ఏళ్ల‌ లోపు గుండెపోటు వచ్చినా.. వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవ‌కాశం అధికం.
కొలెస్ట్రాల్‌తో సమస్యలు : Problems with cholesterol

నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ అధికమైపోయి గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్‌ స్థాయి నిర్ధారణ అవుతుంది.

ఊబకాయుల్లోనే అధిక కొలెస్ట్రాల్‌ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్నవారిలోనూ అధిక కొలెస్ట్రాల్‌ ఉండవచ్చు. కాబట్టి, తరచూ కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పుచేర్పులు కూడా అవసరమే.

ఆహారపు అలవాట్లు : Eating habits

గత పదేళ్ల‌లో ఆహారపు అలవాట్లు చాలా మారి పోయాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకొనే అలవాటు తగ్గిపోయింది. డీప్‌ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్ తిన‌డ‌మే ఎక్కువైంది. దీనివల్ల బరువు పెరిగి కొలెస్ట్రాల్‌, షుగర్‌ స్థాయిలూ మితిమీరిపోతున్నాయి.

అధిక బరువు, ఊబకాయం : Overweight, obesity

అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం.. బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ, షుగర్‌లకు ప్రారంభ దశగా భావించాలి. ఊబకాయం హఠాత్తుగా రాదు. బరువు క్రమంగానే పెరుగుతుంది.

శారీరక శ్రమ లేకపోవడం : Lack of physical activity

శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల చాలామంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు.

సమయానికి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం లేదు. దీంతో యువతలో బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోతున్నాయి. అంతిమంగా గుండెపోటుకు దారితీస్తున్నాయి.

Why does heartache occur? What are the causes and mitigation measures?
మితిమీరిన వ్యాయామం చేయ‌డం : Excessive exercise

సాధారణంగా, పుట్టిన ఏడాది కాలం నుంచీ ప్రతి వ్యక్తిలో కొంత మేర రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఉండటం సహజం. ఇది వయసుతో పాటు అతి నెమ్మదిగా పెరుగుతుంది. అయితే, ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి ఫలితంగా ఈ బ్లాకేజ్‌ ఒక్కసారిగా తీవ్రం అవుతుంది. అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు.

నిత్యం వ్యాయామం చేయకుండా, ఒకేసారి మితిమీరిన కసరత్తుకు సిద్ధపడితే గుండె మీద భారం పడుతుంది. అది గుండెపోటుకు దారితీసే అవ‌కాశం ఉంది..

జిమ్‌ వర్కవుట్స్‌తో హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు నిమిషాల్లోనే 40 నుంచి 100 శాతం మేర బ్లాక్‌ అవుతాయి. దీంతో, గుండెపోటు వస్తుంది.

మానసిక ఒత్తిడి : mental stress

గతంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. కరోనా కాలం నుంచీ ప్రతి ఇల్లూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో బిజీబిజీగా కనిపిస్తున్నది. మినీ ఆఫీసుగా మారుతున్నది.

ఇంట్లో నుంచే పనిచేస్తుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నది యువత. కుటుంబ, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ అభద్రత, ఆలూమగల బంధాలకు బీటలు.. తదితర కారణాల వల్ల మానసిక రుగ్మతలు అధికం అవుతున్నాయి. ఈ ‘సైకాలజికల్‌ స్ట్రెస్‌’ కూడా గుండెపోటుకు ఓ కారణమే.

మైగ్రేన్ త‌ల‌నొప్పి అంటే ఏమిటి? ఎందుకు వ‌స్తుంది?
మాదక ద్రవ్యాల వినియోగం : Drug use

యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నది. గుండెపోటుకు గురవుతున్న నలభై ఏళ్ల‌లోపు వారితో పోల్చుకుంటే మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నవారి సంఖ్య తక్కువేం కాదు.

మత్తు పదార్థాల వల్ల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండెకు రక్త సరఫరా మందగించి గుండెపోటుకు దారి తీస్తుంది.

Why does heartache occur? What are the causes and mitigation measures?
రక్తనాళాలు చితికిపోవడం : Blood vessel constriction

రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల కూడా గుండెపోటు వస్తుంది. కాకపోతే, రక్తనాళాలు చితికిపోవడం లేదా పగిలిపోవడం చాలా అరుదైన పరిణామం. దీనికి కచ్చితమైన కారణాలు చెప్పలేం. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఈ ప్రమాదం పొంచి ఉంది.

గుండెపోటు నివారణకు చర్యలు : Measures to prevent heart attack
  • మధుమేహం , కొలెస్ట్రాల్‌ నియంత్రణలో పెట్టుకోవాలి (డయాబెటిస్‌ మరియు, అధిక కొవ్వు గల వ్యక్తులకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2-3 రెట్లు ఎక్కువ)
  • ధూమపానం మానేయాలి (గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానేస్తే బీపీ , గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు)
  • శారీరక శ్రమ , వ్యాయామం తప్పనిసరి (రోజుకూ 30 నిమిషాలు లేదా వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం, పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు)
  • ప్రతి రోజూ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి (ఇందులో కొవ్వు తక్కువగా మరియు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి)
  • ఫాస్ట్ ఫుడ్స్, శీతల పానీయాలు, కేలరీలు ఎక్కువగా, పోషకాహారం తక్కువ వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది
  • వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిళ్లు, అధికంగా ఆలోచించ‌డం మానేయాలి.
  •  రోజులో కనీసం 7-8 గంటల పాటు నిద్రించడం వల్ల గుండె పోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు
  • వేరుశెనగ నూనె, కొబ్బరి నూనెలను తగిన మోతాదులో తీసుకోవాలి
  • రెడ్‌ మీట్‌ (బీఫ్‌, పోర్క్‌, మటన్‌) వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు
    అయితే సాధారణంగా 30% పైగా గుండెపోటు స‌మ‌స్య‌ను ఈసీజీ (ECG) పరీక్షల ద్వారానే నిర్ధారిస్తారు. వీటితో పాటు:

ల్యాబ్‌ పరీక్షలు: లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) పరీక్ష, కార్డియాక్ ట్రోపోనిన్‌లు (I, T), క్రియేటిన్ కినేస్ (CK), మయోగ్లోబిన్.

ఇమేజింగ్ పరీక్షలు: ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (EKG/ECG), అంబులేటరీ EKG, ఎకోకార్డియోగ్రఫీ, కరోటిడ్ అల్ట్రాసౌండ్, కార్డియాక్ CT, కరోనరీ యాంజియోగ్రఫీ, కార్డియాక్ కాథెటరైజేషన్
ట్రాన్సోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ (TEE) అలాగే ప్రతి సంవత్సరం TMT అనే పరీక్షను చేయించుకోవడం కూడా మంచిది.

ఈ నివార‌ణ చ‌ర్య‌లు పాటించ‌డం వ‌ల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉండ‌వ‌చ్చు. అంతే కాకుండా ఆరోగ్యకరమైన , సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

 

Leave a Comment