Why do knee pains occur? – మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. కారణాలివే?
చాలామంది విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. Why do knee pains occur? ఏ పని చేయాలన్నా మోకాలు సహకరించకపోవడంతో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. నడవాలన్నా, మెట్లు ఎక్కాలి అన్నా, పరిగెత్తాలి అన్నా, పని చేయాలన్నా మోకాలు నొప్పి ఎక్కువగా ఉన్నవారు తీవ్ర ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు. ఇక మోకాలు నొప్పి బాధ పడలేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారు అనేక మంది ఉన్నారు.
మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? – Why do knee pains occur? :
ప్రస్తుతం జీవన విధానంలో వచ్చిన మార్పులతో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాళ్ల నొప్పులకు గురవుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు కూర్చోవడం, నడవడం, నిలబడడంలో కష్టపడటమే కాక రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా ఎముకల్లో గట్టిదనం లేకపోవడం, కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ సమస్య పురుషుల కంటే మహిళ్లల్లోనే ఎక్కువ. మోకాళ్ల నొప్పులు ఉన్నవారిలో మొదట కీళ్లలో వాపు, మోకాలు ఎర్రబడటం, ఆ తరువాత భరించలేని నొప్పి మోకాలు మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియ సుమారు 2-5 సంవత్సరాల కాలంలో జరుగుతుంది.
మోకాలి నొప్పికి కారణమిదే.. – Knee pain reasons.. :
కీళ్లు బలహీనంగా మారడం వల్ల మోకాలు లోపలి కణజాలం దెబ్బతింటుందని, దీని వల్ల లోపల మృదులాస్థి అరిగిపోవడం జరుగుతుందని, అటువంటి సమయంలో ఎటువంటి మూమెంట్ ఇచ్చినా తీవ్రమైన నొప్పి, మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మోకాలు నొప్పి రావడానికి విపరీతంగా బరువు ఉండటం, సరైన వ్యాయామం శరీరానికి లేకపోవడం, శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం వంటివి కూడా ఒక కారణం.
మోకాళ్ల నొప్పికి గల కారణాలు – Knee pain reasons :
అధిక బరువును (ఊబకాయం) కలిగి ఉండడం మోకాలి నొప్పికి ప్రధాన కారణం. వీటితో పాటు:
వయస్సు పెరగడం
సరైన వ్యాయామం లేకపోవడం
ఎక్కువసేపు నిలబడి ఉండడం, మోకాళ్లపై కూర్చోవడం
శరీరానికి కావాల్సిన విటమిన్ డి3 లేకపోవడం
కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి, గాయాలు, బెణుకులు
ఆర్థరైటిస్, గౌట్, ఎముక నొప్పి వంటి అంతర్గత కారణాలు కూడా మోకాలి నొప్పులకు కారణం కావొచ్చు
- మోకాళ్ల నొప్పులు తగ్గించుకునేందుకు పాటించాల్సిన ఆహార నియమాలు
- మోకాళ్ల నొప్పులు ఉన్న వారు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
- రోజూ వారి ఆహారంలో తాజా కూరగాయలు, అన్ని రకాల పండ్లను తీసుకోవాలి
- పాలిష్ చేసిన తెల్ల బియ్యం, బేకరీ ఫుడ్స్, వేపుళ్లు, స్వీట్లు, పంచదార, టీ , కాఫీలు వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది
- కొవ్వు అధికంగా ఉండే మాంసాహారాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి
- ఒమేగా-3 అధికంగా మరియు కొవ్వు తక్కువ ఉండే చేపలు, అవిసె, ఆక్రోట్ గింజలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి
వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా..?
మోకాళ్ల నొప్పుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవాలంటే సాధ్యమైనంత వరకు శరీర బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు:
రోజూ వారీగా సరైన సమతుల్య పోషకాహారం తీసుకోవడం
వైద్యులు సూచనల మేరకు వ్యాయామాలు చేయడం
ఉదయం సూర్యరశ్మి మోకాలిపై పడేలాగా చూసుకోవాలి
స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు కూడా మోకాళ్ల నొప్పుల నివారణకు మంచిది
- మెట్లు ఎక్కడం, ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో నడవడం వంటివి మానుకోవాలి
- ఏరోబిక్స్, జుంబా వంటి వ్యాయమాలు చేయకపోవడం మంచిది
బరువులు ఎత్తడం వంటి నొప్పిని పెంచే కార్యకలాపాలను నివారించుకోవాలి - మోకాళ్ల నొప్పులకు డాక్టర్ సూచించని మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు
- పై చర్యలను పాటించడం వల్ల మోకాలి చుట్టూ ఉండే కండరాలు బలపడి మోకాళ్ళ పై కొంతమేర ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
మోకాళ్ల నొప్పి ఉపశమనానికి..: – To relieve knee pain :
సరైన పోషకాహారం తీసుకోవడం, బరువు తగ్గడం పై శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, చాలావరకు ఉపశమనాన్ని ఇస్తాయి. మోకాలి చుట్టూ ఉండే కండరాలు బలపడితే మోకాళ్లపై కొంతమేర ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ల నొప్పుల సమస్యలు ఉన్నవారు మెట్లెక్కడం, ఏటవాలుగా ఉన్న ప్రదేశాలలో నడవడం వంటివి చేయకూడదని ఏరోబిక్స్, జుంబా వంటివి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మోకాళ్లు వంచి చేసే వ్యాయామాలు కూడా చేయకూడదని సూచిస్తున్నారు.
మోకాళ్ల కండరాలను బలోపేతం చేసే నౌకాసనం వంటి ఆసనాలు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నౌకాసనం తో మోకాలి కండరాలు బలంగా మారడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు కుర్చీలో కూర్చుని చేసే సింపుల్ వ్యాయామాలు మోకాలి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. సూర్య నమస్కారాలు కూడా ఎంతో రిలీఫ్ ను ఇస్తాయి.
మోకాళ్ల నొప్పికి శస్త్ర చికిత్సలు : Surgical treatments for knee pain :
మోకాళ్ల నొప్పిని భరించలేక చాలామంది మోకాలు శస్త్రచికిత్సల బాట పడుతున్నారు. అయితే మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి సరైన ప్రయత్నం చేయకుండా, ఆపరేషన్లు చేయించుకోవడం మంచిది కాదని కూడా వైద్యులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఉదయం సూర్యరశ్మి మోకాలిపై పడేలాగా చూసుకోవడం, వైద్యులు సూచించిన కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం చేస్తే శస్త్రచికిత్స అవసరం లేకుండా మోకాలి నొప్పులు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.