మైగ్రేన్ తలనొప్పి అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? – What is a migraine? Why does it come?
మైగ్రేన్ తలనొప్పి అందరినీ వేధిస్తున్న సమస్య. దీంతో బాధపడేవారికి సాధారణ తలనొప్పి కి మించి What is a migraine? Why does it come? సమస్కలు ఉంటాయి. వాంతులు, వికారం, కాంతిని చూడలేకపోవడం వంటి సమస్యలుంటాయి. పని ఒత్తిడి, అలసట దీంతో తలనొన్పి మొదలవుతుంది. సాధారణంగా వచ్చే తలనొప్పి తొందరగానే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే ఆ బాధ భయంకరం.
మెదడులో జన్యువుల్లో మార్పులు, మైగ్రేన్ తలనొప్పికి కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. పార్శ్వ నొప్పి ( మైగ్రేన్ )తో తలెత్తే సమస్యలు అనేకం. అయితే మనకున్న కొన్ని అలవాట్లు సైతం ఈ సమస్యకు కారణం కావచ్చు. అసలు మైగ్రేన్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది. దీనికి చికిత్స ఉందా ..? అనే విషయాలు తెలుసుకుందాం!
మైగ్రేన్ తలనొప్పి అంటే ఏమిటి?- What is migraine Headache? :
మైగ్రేన్ తలనొప్పి అనేక రకాలుగా ఉంటుంది. ఇందులో మైగ్రేన్ తలనొప్పి కాస్తా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నొప్పి తలలో ఒకే వైపు వస్తుంది. ఈ నొప్పి కొద్దిసేపు ఉండి తగ్గిపోయేది కాదు. గంటల నుంచి రోజుల తరబడి కూడా ఉంటుంది.
నాడీ కణాలు ఎక్కువగా స్పందించడం వల్ల ఈ నొప్పి వస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, హార్మోన్లలో అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి.
సాధారణంగా తలనొప్పి వస్తే శబ్దాలు వినలేరు. కళ్లు నొప్పిగా ఉండటం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ మైగ్రేన్ తలనొప్పి వస్తే కళ్లు తిరగడం, కళ్లు సరిగ్గా కనిపించకపోవడం, విపరీతమైన తలనొప్పి ఉంటుంది.
ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స లేదు. కానీ భయపడాల్సినంత ప్రమాదకరమైన వ్యాధి కాదు. శాశ్వత పరిష్కారం లేకున్నా.. ఈ సమస్య వచ్చినప్పుడు ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకోవాలి.
- నొప్పి ఉన్న చోట ఐస్‌క్యూబ్‌లను పెట్టాలి. కాస్త ఉపశమనం కలుగుతుంది.
- పెద్ద పెద్ద శబ్దాలు, ఎక్కువగా వెలుతూరు లేని గదిలో నిద్రపోవాలి.
- మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే యోగా, ప్రాణాయామం చేయాలి.
- మైగ్రేన్ తలనొప్పి తో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెతో నొప్పి ఉన్న చోట మర్దన చేసుకోంది. దీంతో నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
- మైగ్రేన్ తలనొప్పి వస్తే ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి.
- ఏ విధమైన సమస్యకైనా నిద్ర ఓ చక్కటి పరిష్కారం. మంచి నిద్ర శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అందుకే నిర్ణీత సమయం వరకు నిద్ర పోవాలి.
- ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవాలి.
మైగ్రేన్ తలనొప్పికి కారణాలు – Causes of migraine Headaches :
అలసట, శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి
నిద్రలేమి
అతినిద్ర
ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం
డీహైడ్రేషన్
మలబధ్ధకం
కంప్యూటర్ల ముందూ,ఆఫీసులోనూ, పని చేసే చోట ఒకే స్థాయిలో ఎక్కువ సేపు కూర్చోవడం వలన కండరాలు పట్టేయడం. ఇవి సర్వ సాధారణమైన కారణాలు.
మైగ్రేన్ ఎలా వస్తుంది? – How does migraine occurs? :
- ఒత్తిడి
- ఆందోళన
- నిరాశ
- అలర్జీలు
- అధికంగా మద్యం తాగడం
- నిద్ర మాత్రలు, గర్భనిరోధక మాత్రలు వంటి కొన్ని మందులు
- నాడీ వ్యవస్థ రుగ్మత
- సక్రమంగా లేని రక్త నాళాలు, మరియు ప్రసరణ వ్యవస్థ
- బిగ్గరగా సంగీతం
- క్రమరహిత రక్త చక్కెర స్థాయిలు
- అతిగా నిద్రపోతున్నా..
- టీవీ, ల్యాప్‌టాప్ సెల్ ఫోన్లు ఎక్కువ చూసే వారికి అలర్ట్..!
చిన్న పాటి శబ్ధం వినిపించినా వారు తట్టుకోలేరు, పైగా వారు చాలా హైపర్ యాక్టివ్ గా కూడా ఉంటారు. ఎదుటి వారు చిన్న మాట అన్నా సరే చాలా వయలెంట్ గా రియాక్ట్ అవుతుంటారు. ఒక్కోసారి కొంచెం నలతగా లేదా మూడీగా కూడా ఉంటారు. ఇలా మైగ్రైన్ నాలుగు రకాలుగా ప్రభావం చూపిస్తుంది.
సరైన సమయంలో వ్యాధి లక్షణాలని గుర్తించడం వల్ల దాని యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ దగ్గర ఎంత వివరంగా తెలియజేస్తే ట్రీట్మెంట్ కూడా అంతే చక్కగా లభించే అవకాశం ఉంటుంది.
మైగ్రైన్ వచ్చిన వాళ్ళలో మరో ప్రధాన మైన సమస్య విజువల్ ఆరా (కంటి చూపులో సమస్యలు). చాలా కొద్ది మందిలో మాత్రమే ఇటువంటి సమస్యలు వస్తాయి.
ఏది ఏమైనప్పటికీ మైగ్రైన్ అనేది రోగిని అత్యంత భయంకరంగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ సరైన ట్రీట్మెంట్ లభిస్తే చాలావరకూ ఉపశమనం లభిస్తుందని న్యూరాలజిస్ట్ ప్రదీప్ కుమార్ రెడ్డి సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు పురుషుల కంటే మహిళలకే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ రేషియో 3: 1 నిష్పత్తిలో ఉంటుంది. తల ఒక వైపున తీవ్రమైన నొప్పి, లైట్, సౌండ్‌ను భరించలేకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం వంటివి తరచూ కనిపిస్తాయి.
వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా..?
యోగాతో మైగ్రేన్ తగ్గుతుందా.. – Does yoga reduces migraine.. :
ప్రస్తుత రోజుల్లో చాలా మందిని మైగ్రేన్ (వాంతులతో కూడిన విపరీతమైన తలనొప్పి) బారిన పడుతున్నారు. ఈ తలనొప్పి రావడానికి ప్రధాన కారణం ప్రస్తుత రోజుల్లో మన జీవనశైలే అని కొందరు సూచిస్తున్నారు. అటువంటి మైగ్రేన్ నొప్పిని కూడా ఈ యోగాసనాల ద్వారా కంట్రోల్ చేసుకోవడం సాధ్యపడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
మైగ్రేన్‌కి కారణాలు.. – Causes of migraine :
అనేక మందికి మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందని సందేహాలు వ్యక్తం చేస్తారు. ప్రస్తుత జీవనశైలి విధానం కూడా చాలా మందిలో మైగ్రేన్ తలనొప్పి రావడానికి ఒక కారణం అని చాలా మంది డాక్టర్లు తెలిపారు.
అధికంగా కాంతి, ధ్వని రావడం వలన ఈ మైగ్రేన్ తలనొప్పి సంభవిస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా మంది అనేక రకాల మందులను వాడుతారు.
మందులు ఒక రకంగా ఈ తలనొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడొచ్చు. నొప్పి నివారణ కోసం యోగాసనాలు వేయడం కూడా ఉత్తమ మార్గం అని పలువురు యోగా నిపుణులు సూచించారు.