వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా..?-How to maintain health in sumer..?
వేసవి మెుదలైంది. ఎండ తీవ్రంగా ఉంది. మండే ఎండలో కాసేపు బయట నడిస్తే, అలసిపోతాం. How to maintain health in sumer..? మార్చిలోనే సూరీడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఏప్రిల్, మే నెలలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వేసవి వేడికి శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో నీరసం వస్తుంది. దీన్ని అధిగమించాలంటే ఎక్కవగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. విటమిన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఏదిపడితే అది తినటం మానుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఈ సమయంలో తీసుకోకుండా ఉండటమే ఉత్తమం.
ఎండ వేడికి చిన్న పిల్లలు, వృద్ధులు తట్టుకోలేరు. వారికి ఎండదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
తరచూ నీళ్లు తాగాలి-Drink water :
ఎండాకాలంలో శరీరం ఎక్కువగా నీళ్లను చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తుంటే.. నీళ్ల సీసాలను తీసుకెళ్లడం మరిచిపోవద్దు.
నిద్ర – Sleep :
నిద్ర ఆరోగ్యం, శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తుంది. సరైన సమయాల్లో తగినంత నిద్ర పోవాలి. మానసిక , శారీరక ఆరోగ్యం, భద్రత , జీవిత నాణ్యతను కాపాడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి- Regular exercise :
క్రమం తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా చురుకుగా ఉండటమే కాకుండా వేసవిలో హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, నొప్పిని తగ్గించడానికి , సన్నగా అవ్వడానికి అనువైన కాలమిది . వ్యాయామం కోసం పార్కులు సందర్శించడం వంటి సరళమైన చర్యలను పాటించడం వలన ఆరోగ్యకరమైన చల్లని గాలిని శ్వాస లాగా పొందవచ్చు. ప్రతి రోజు వ్యాయామం దేహం ధృడంగా మారి యవ్వనంగా కనిపిస్తారు.
ధూమపానం, మద్యపానం మానేయడం – Avoid Smoking and Drinking :
ధూమపానం, మద్యపానం మనేసి కొత్త ఆరోగ్యకరమైన అలవాట్లు, కార్యకలాపాలతో మిమ్మల్ని బిజీగా ఉండేలా చూసుకోవాలి, ధూమపానం, మద్యపానం మానేయడం వలన గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది.
నీడలో ఉండడానికి ప్రయత్నించండి – Try to stay in the shade
వేసవిలో మనం సాధ్యమైనప్పుడు నీడలో ఉండటం చాలా ముఖ్యం. UV కిరణాలూ 10am నుంచి 4pm మధ్య సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయం లో మీరు బయటికి రాకుండా ఉండాలి. ఒకవేళ తప్పని పరిస్తితి అయితే టోపీ, సన్ గ్లాసెస్ ధరించడం మంచిది.
విహారయాత్రలకు వెళ్ళండి – Go on excursions :
వ్యక్తిగత పని ఒత్తిడి నుంచి బయట పడడానికి విహారయాత్రలకు వెళ్లడం చాలా మంచిది, ఈ వేసవిలో బీచ్ లేదా స్విమ్మింగ్ పూల్ వద్ద ఎక్కువ సమయం గడిపితే వేసవిలో శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.
మొబైల్ ఫోన్ దూరంగా ఉంచండి – Keep the mobile phone away :
ప్రస్తుత కాలం మొబైల్ ని దూరంగా ఉంచడం అంటే కష్టమైన పనే అయినా ప్రయత్నించండి. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేసి స్మార్ట్ ఫోన్లను దూరంగా ప్రపంచాన్ని చూడండి. సాంకేతికత లేకుండా జీవితం ఆనందించండి. ఇతర వ్యక్తులతో సంభాషణలు, కార్యకలాపాల్లో పాల్గొనండి.
ఉన్న చోట వాతావరణం చల్లగా ఉండేలా చూస్కోండి : Make sure environment cool :
వేడిగా ఉన్నప్పుడు, మీ చుట్టూ వాతావరణం అయిన చల్లగా ఉండేలా చుస్కుకోండి. మీరు ఉండే గదులని చల్లగా ఉండేలా చేస్కోవడం వలన మీ దేహం ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే బయట తయారు చేసిన భోజనం కాకుండా ఆరోగ్యకరమైన మన ఇంటి వంట ఉండేలా చూసుకోవాలి.
మధుమేహులూ ఈ పండ్లు తినొచ్చు
అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు..- Do not go out side unless necessary
వేసవిలో వీలైనంతవరకు ఇంట్లో లేదా నీడ ప్రాంతాల్లో ఉండేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైనా పని ఉంటే ఉదయం, సాయంత్రం సమయాల్లో చూసుకోవాలని అంటున్నారు.
డాక్టర్‌ను సంప్రదించాలి : Approach Doctore :
వేసవిలో ఉత్తమ అనుభూతిని కలిగి ఉండాలనుకుంటున్నారు కాబట్టి శీతాకాలం, వసంతకాలం నుంచి నొప్పి ఉంటే, వైద్యుడ్ని సంప్రదించాలి. దీనితో ఈ వేసవికాలం నుంచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చు.
ఇలా చెయ్యండి : Do this :
– దాహం లేకపోనా నీరు తాగుతూనే ఉండండి.
– తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినండి.
– వేడి పెరిగినప్పుడు బయటకు వెళ్లకండి.
– వదులుగా ఉండే బట్టలు వేసుకోండి.
– లైట్ కలర్ ఉండే బట్టలు వేసుకోండి.
– బయటివైపు ఆటలు వద్దు.
– బయట పనిచేస్తుంటే… మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోండి.
– మద్యం తాగొద్దు. ఎక్కువ కెఫైన్ తీసుకోవద్దు.
– ఎక్కువ ఎక్సర్‌సైజ్‌లు చెయ్యవద్దు. ఎండల్లో అస్సలు వద్దు.
ఎండలతో అనారోగ్య లక్షణాలు – Illness symptoms with sunburn :
– కండరాల్లో నొప్పి, పొట్టలో నొప్పి వస్తుంటే… అది ఎండ వల్ల కావచ్చు. ఎక్కువ సేపు ఎండలో తిరిగితే అలా అవుతుంది. నీరు సరిగా తాగకపోయినా ఇలా జరుగుతుంది.
వడదెబ్బ లక్షణాలు – Symptoms on sunburn
చర్మం జిడ్డుగా, రంగు పాలిపోయినట్లుగా, ఎర్రగా మారిపోతే… వడదెబ్బ వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలి. చెమట బాగా పడుతుంది. తలనొప్పి వస్తుంది. వికారంగా ఉంటుంది. కళ్లు మసగ్గా అవుతాయి. నీరసం వస్తుంది. దీంతో కిందపడిపోతారు.
– వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లటి నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి.
– బట్టలు బిగుతుగా ఉంటే… లూజుగా చెయ్యాలి.
– శరీరాన్ని చల్లటి, తడి బట్టను తుడవాలి
– కొద్ది కొద్దిగా నీళ్లు తాగించాలి.
– వాంతులు అవుతుంటే… అపస్మారక స్థితిలోకి వెళ్తుంటే… వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.