Diabetic patients can also eat these fruits – మధుమేహులూ ఈ పండ్లు తినొచ్చు
మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు ఉన్నాయి. Diabetic patients can also eat these fruits కొన్ని తీపి ఎక్కువగా ఉంటాయి. కొన్ని తీపి తక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు అన్ని రకాల పండ్లను ఇష్టంగానే తింటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు మాత్రం పండ్లను తినాలంటే ఒకింత సందేహిస్తుంటారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు తినడమూ ముఖ్యమే. దానితో పాటు తీసుకునే పండ్లు కీలక పాత్ర వహిస్తాయి.
పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ, మధుమేహం ఉన్న వారు పండ్లు తినాలంటే కాస్త వెనకడుగువేస్తారు.
ఎందుకంటే.. పండ్లలో చక్కెరస్థాయి ఎక్కువ ఉంటుందని.. వాటిని తింటే మధుమేహం పెరుగుతుందని భయపడతారు. అది నిజమే కానీ .. అన్ని పండ్లు |హానికరం కావు.
గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) తక్కువగా ఉన్న పండ్లను మధుమేహులూ నిస్సందేహంగా తీసుకోవచ్చు. మరి అవి ఏ పండ్లు.. వాటి ఉపయోగాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Diabetic patients can also eat these fruits
అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే..? ( Glycemic index ) :
మనం తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. అలా రక్తంలో చక్కెర స్థాయి ఎంతమేర పెరుగుతుందో తెలిపే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అటారు.
తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 55కు మించకుండా ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 56-69 మధ్య ఉంటే మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు.
మధుమేహం ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎక్కువగా తినాలి.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు ఇవే..
దానిమ్మ – Pomegranate :
దానిమ్మ పండ్లలో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ చక్కెరస్థాయి చాలా తక్కువగా ఉంటుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 18 మాత్రమే. కాబట్టి దానిమ్మ పండ్లను మధుమేహులు ఎలాంటి ఆలోచన లేకుండా తినొచ్చు.
వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ యాక్సిడెంట్లు కణాలను నాశనం చేసే ప్రమాదకర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి.
రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంతోపాటు కొవ్వు స్థాయిలను సైతం తగ్గిస్తాయి. దానిమ్మలో పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.
యాపిల్ – Apple :
రోజుకో యాపిల్ తింటే వైద్యుల అవసరం రాదు అని నానుడి. వీటిలో విటమిన్ సి, పీచు, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
యాపిల్లో ఉండే పీచు, పాలీఫినోల్స్ కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిలువరిస్తాయి.
యాపిల్ లో చక్కెర ఉంటుంది. అయితే, అది ఫ్రక్టోస్ రూపంలో ఉంటుంది.
ఈ ఫ్రక్టోస్ రక్తంలోని చక్కెర స్థాయిపై పెద్దగా ప్రభావం చూపదు. యాపిల్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీంతో చక్కెరస్థాయి పెరగకుండా ఉంటుంది.
యాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ 36గా ఉంటుంది కాబట్టి.. మధుమేహంతో బాధపడుతున్న వారు వీటిని తినొచ్చు.
స్ట్రాబెర్రీ – Strawberry :
స్ట్రాబెర్రీలలో పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియలు మెరుగు పడతాయి.
క్యాన్సర్‌తో పోరాడే శక్తి లభిస్తుంది. బరువును తగ్గించడంలో ఈ పండ్లు సహాయ పడతాయి. వీటి జీఐ విలువ 46. కనుక వీటిని సందేహం లేకుండా తినవచ్చు.
జామకాయ – Guava :
రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో జామకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర శోషణను నియంత్రిస్తుంది. దీంతో చక్కెర స్థాయిలు పెరగవు.
ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటే మంచిది.
జామ పండ్ల జీఐ విలువ అతి తక్కువ. కేవలం 12 మాత్రమే. కనుక ఈ పండ్లను డయాబెటిస్ ఉన్నవారు రోజూ తినవచ్చు. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి, పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
పుచ్చకాయ – Watermelon:
పుచ్చకాయలో దాదాపు 80శాతం నీరే ఉంటుంది. కానీ, పోటాషియం, లైకోపీన్ అనే మూలకం ఎక్కువగా ఉంటాయి.
మధుమేహం కారణంగా నరాలను దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ పుచ్చకాయలో ఉండే లైకోపీన్ అనే మూలకం నరాలు దెబ్బతినకుండా నివారించడంలో దోహదపడతుంది.
కిడ్నీల సరిగా పనిచేయాలంటే ఈ పోటాషియం ఎంతో అవసరం. నిజానికి పుచ్చకాయ గ్లైసమిక్ ఇండెక్స్ అధికంగా(76)ఉంటుంది. కాబట్టి.. తక్కువ మొత్తంలో పుచ్చకాయను తినడం ఉత్తమం.
మధుమేహులు ఏ ఆహారాలు తినాలి..? వేటికి దూరంగా ఉండాలి?
ద్రాక్ష – Grapes :
ద్రాక్ష పండ్ల జీఐ విలువ 53-59 మధ్య ఉంటుంది. ఇది మధ్యస్థ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ. కానీ ద్రాక్ష పండ్లను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
ఈ పండ్లలో విటమిన్ సి, రెస్వెరాట్రోల్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను శరీరం గ్రహించేలా చేస్తాయి.
దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రక్తంలో చక్కెర నిల్వ అవకుండా చూస్తాయి. ద్రాక్ష పండ్లను కూడా డయాబెటిస్ ఉన్నవారు తరచూ తింటుండాలి.
నారింజ – Orange :
నారింజ (బత్తాయి) పండ్లలో విటమిన్ సి, పీచు, ఫోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పండ్ల జీఐ విలువ 40 వరకు ఉంటుంది. అందువల్ల వీటిని డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం చెందకుండా తినవచ్చు.
బత్తాయి పండ్లను తినడం వల్ల శరీరానికి మేలే జరుగుతుంది. ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉండటంతో వీటిని తిన్నా జీర్ణమై నెమ్మదిగా రక్తంలో కలవడానికి చాలా సమయం తీసుకుంటుంది.
కాబట్టి బత్తాయిల ఉండే చక్కెర రక్తంలో ఉండే చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపదు.
బొప్పాయి – Papaya :
మధుమేహంతో బాధపడేవారు తినాల్సిన పండ్లలో బొప్పాయి ఒకటి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు అధికంగా ఉంటాయి. ఈ పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. కనుక వీటిని అప్పుడప్పుడు తినవచ్చు.
బొప్పాయి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. కనుక వీటిని తరచూ తింటే మంచిది.
మధుమేహం వల్ల ఏర్పడే గుండె, నరాల సమస్యను బొప్పాయి అడ్డుకుంటుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. ఈ పండ్లలో చక్కెర ఫ్రక్టోస్ రూపంలో ఉంటుంది.
ఇక ఇవే కాకుండా నేరేడు, అంజీర్, కివీ పండ్లను కూడా డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. ఇవి తక్కువ జీఐ విలువను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ తినవచ్చు.