What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?

What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?

వేస‌విలో ఎండ‌లు మండిపోతున్నాయి.  ఎండ‌లు  What kinds of Drinks to take in Summer?పెరిగే కొద్ది నోరు నాలుక త‌డి ఆర‌క‌పోవ‌డం, పెదాలు ఎండిపోవ‌డం, విపరీతమైన చెమట కారణంగా డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలసట కూడా వస్తుంది. వేసవిలో రోగనిరోధక వ్యవస్థ మాదిరిగానే, పొట్టలో కూడా అనేక మార్పులు జరుగుతాయి.

ఈ కారణంగా జీర్ణక్రియ సమస్యలు ఎక్కువ అవుతాయి. అతిసారం, UTI, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు అధికమవుతాయి.

ఈ సమస్యలను అధిగ‌మించేందుకు శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవాలి. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు ఎలాంటి పానీయాలు తీసుకోవాలో తెలుసుకుందాం!

శ‌రీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు..
మజ్జిగ -Buttermilk :

 

These Foods are summer in good for health..!
What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?
వేసవిలో పెరుగు, మజ్జిగలు తప్పకుండా తీసుకోవాలి. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోబయాటిక్స్‌ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్‌ మీ గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి.
ఇందులో క్యాల్షియం, ప్రొటీన్‌, బి12 వంటి విటమిన్లు పుష్కలం. ఇవి మనసును, శరీరాన్ని శాంత పరచడమే కాకుండా వడదెబ్బ నుంచీ రక్షిస్తాయి.

కొబ్బరి నీరు – Coconut Water :

These Foods are summer in good for health..!
What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?

వేసవి కాలంలో UTI, మూత్రవిసర్జన సమయంలో మంట వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కొబ్బరి నీళ్లు బెస్ట్‌ డ్రింక్‌ అని చెప్పాలి. కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తాయి.

కాబట్టి ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో 9 శాతం ఫైబర్‌ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎసిడిటీ వేధిస్తుంటే.. గ్లాస్‌ కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ ర‌సం – Lemon water :

What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?

వేసవి కాలం నిమ్మరసం కలిపి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి నిమ్మరసంలోని యాసిడ్స్‌ తోడ్పతాయి. దీంతో, యాసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావు.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు.

సబ్జాగింజలు నానబెట్టిన నీటిలో నిమ్మరసం పిండి తీసుకుంటే ఇంకా మంచిది. ఈ డ్రింక్‌ శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.

చెరకు రసం – Sugarcane juice :

These Foods are summer in good for health..!
What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?

 

చల్లని చెరకు రసం తాగితే అలసట, నిస్సత్తువ మాయం అవుతాయి. శరీరాన్ని రీహైడ్రేట్‌ చేస్తుంది. చెరకు రసంలో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

వేసవిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి చెరకు రసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

బార్లీ వాటర్ – Barley water :

అదే విధంగా బార్లీ గింజల్లో నీళ్లు పోసి ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని తాగితే చాలా మంచిది. ఎలాంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.

చిన్న పిల్లలకు పట్టిస్తే వడ దెబ్బ, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు. అలాగే టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. మంచి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి.

What to do stay healthy in summer? -వేస‌విలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

సబ్జా గింజల నీరు ‍- Sabja seeds Water : 

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి.

పుచ్చకాయ జ్యూస్ – Watermelon juice :
Diabetic patients can also eat these fruits
What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?

వేసవిలో ఎక్కవ మంది ఇష్టంగా తినే పండు పుచ్చకాయ. ఈ జ్యూస్‌ను కూడా చాలా మంది ఇష్టపడతారు. పుచ్చకాయ ముక్కలు తిన్నా, కొంచెం చల్లగా జ్యూస్ రూపంలో తీసుకున్నా శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది.

పుచ్చకాయ గింజల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు కూడా ఉన్నాయి. ఎండిన పుచ్చకాయ గింజలను తినడం ద్వారా అధిక స్థాయి రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు.

పటికబెల్లం వేసిన పాలు – Alum milk :
What kinds of Drinks to take in Summer? వేస‌విలో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి?
వేసవిలో, అధిక వేడి కారణంగా పిత్త దోషం ఏర్పడుతుంది. కాబట్టి, పడుకునే ముందు పటిక బెల్లం వేసిన పాలు తాగితే చాలా మంచిది.
ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, మంచి నిద్రకు సహాయపడుతుంది.

అరటిదిండు రసం – Banana Juice :
అరటి దిండులతో చేసిన రసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్య తగ్గుతుంది. అరటి దిండులలో పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది.

ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది. అరటి దిండులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6 కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

అరటి దిండ్లు తినడం వల్ల బరువు సమతుల్యం అవుతుంది. ఇది శరీరంలోని కొవ్వు పదార్ధాలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.

జల్‌జీరా – Jal Jeera :
జల్‌జీరా’ అనేది జీలకర్ర, చింతపండు, నిమ్మకాయ, పుదీనా, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, ఇతర పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ పానీయం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. చల్లదనంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచే డ్రింక్‌ జల్‌జీరా.

సత్తు పానీయం – Sattu Drink : 
ఇందులో ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది, ఇది వేగవంతమైన శక్తిని ఇస్తుంది..
ఇది ఫైబర్ కలిగి ఉన్నందున ప్రేగులకు మంచిది. ఇది గ్యాస్, మలబద్ధకం, యాసిడిటీని కూడా నియంత్రిస్తుంది, ఇది వేసవి శీతలీకరణకు అనువైనదిగా చేస్తుంది.

Leave a Comment