What to do stay healthy in summer? -వేస‌విలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

What to do stay healthy in summer? -వేస‌విలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

వేసవి వచ్చేసింది. What to do stay healthy in summer? ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తేమనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు, పండ్లు తీసుకోవాలి.

ఈ వేసవిలో What to do stay healthy in summer? ఆరోగ్యంగా ఉండటానికి, మండుతున్న ఎండ నుంచి సంర‌క్షించుకునేందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు పాటించాలి.

ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి : Drink more fluids:

వేస‌విలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం. ఫ‌లితంగా చెమట రూపంలో శరీరం నీటిని కోల్పోతుంది.

అందుకే నీరు, ఇతర ద్రవ పదార్ధాలను అధికంగా తీసుకోవ‌డం మంచిది. పూర్తిగా హైడ్రేష‌న్‌కు గురి కాకుండా ఉండాలంటే రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలసటను నివారించడంలో మెరుగైన సామర్థ్యం కలిగిన ద్ర‌వ‌ప‌దార్థాల‌ను తీసుకోవాలి.

డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ A లేదా E వంటి అనేక వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తాయి. కాబట్టి పరిశుభ్రమైన నీటిని తాగడం చాలా ముఖ్యం.

నీటి శాతం ఉండే ఆహారాలు తీసుకోవాలి: Consume water-rich foods:

వేసవి కాలంలో చల్లగా, నీటి శాతం మెండుగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎండ దెబ్బ కూడ తగలకుండా ఉంటుంది. అదే విధంగా నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, బచ్చలి కూర, పొన్న గంటి కూర, పాల కూర వంటి ఆకు కూరలు తీసుకోవడం చాలా మంచిది.

చెరుకు రసం: Sugarcane juice:

What to do stay healthy in summer?

డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే చెరుకు రసం తాగడం చాలా ముఖ్యం. చెరుకు రసం తాగినా.. చెరకు ముక్కలు తిన్నా డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.

అలాగే నిమ్మ రసంతో చేసిన పానీయాలు కూడా తాగుతూ ఉండాలి. ఉదయం గోరు వెచ్చటి పాలల్లో అటుకులు వేసి తినడం వల్ల కడుపు అనేది చల్లగా ఉంటుంది.

బార్లీ వాటర్: Barley Water:

అదే విధంగా బార్లీ గింజల్లో నీళ్లు పోసి ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని తాగితే చాలా మంచిది. ఎలాంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు.

చిన్న పిల్లలకు పట్టిస్తే వడ దెబ్బ, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు. అలాగే టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. మంచి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి.

ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి : Take care of Food:

వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో లభించే పండ్లు, కూరగాయలను తప్పనిస‌రిగా తీసుకోవాలి. దీంతో శరీరానికి తగినన్ని పోషకాలు లభిస్తాయి. సలాడ్లు, జ్యూస్‌లు, పెరుగు, సీజనల్ పండ్లు, మొలకలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

తేలికగా ఉండే ఆహారాలు తీసుకోవాలి: Take light foods:

వేసవి కాలంలో తేలికగా ఉండే ఆహారాలు, త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం మంచిది. చలి కాలంలో తీసుకునే వేడి వేడి ఆహారాలు.. వేసవి కాలంలో తీసుకోకూడదు.

అలాగే అధిక కొవ్వు, నూనెలతో తయారు చేసే వంటలు కూడా తీసుకోకుండా ఉండాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది. వడ దెబ్బ కూడా తగలకుండా ఉంటుంది.

స్పైసీ ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి: Spicy foods should be avoide:

What to do stay healthy in summer?

మసాలా వంటలు ఎక్కువ‌గా ఇష్టంగా తింటాం. ఎండాకాలంలో వాటికి దూరంగా ఉండట‌మే మంచిది. ఇవి తీసుకుంటే వేసవి కాలంలో జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడానికి తక్కువ నూనెతో తయారు చేసిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి.

సరైన విశ్రాంతి తీసుకోండి : To Take rest:

వేసవి రోజుల్లో శరీరం త్వరగా అలసిపోతుంది. మీ దినచర్య కూడా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి, అలసటను నివారించడానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు రోజుకు క‌నీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.

సూర్యుని నుండి రక్షణ : Protection from the sun

 

What to do stay healthy in summer?

వేసవిలో సూర్యుడు మండిపోతున్నాడు. తద్వారా చర్మసంబంధిత సమస్యలు చాలా ఎక్కువగా వ‌స్తాయి. చర్మం సంర‌క్ష‌ణ‌ కోసం ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడల్లా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఆరోగ్యవంతమైన చర్మం కోసం వైద్యులు సూచించిన బాడీలోష‌న్‌, సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.

సూర్యరశ్మి కారణంగా చర్మ సమస్యలతో బాధ‌ప‌డుతున్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు కోసం తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం చేయాలి.

మ‌ధుమేహంతో ఆరోగ్య స‌మ‌స్య‌లు.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు

వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు 

  1. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి.
  2. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి.
  3. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
  4. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి.
  5. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
  6. ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి.
  7. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.
  8. ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి.
  9. ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి.
  10. పలుచని బట్టలు వేయాలి.
  11. ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్‌వూస్కీన్‌లోషన్లు వాడాలి.
  12. చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి.

Leave a Comment