Health problems with Diabetes and what Precautions to be taken? మధుమేహంతో ఆరోగ్య సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహం తీయని శత్రువు. Health problems with Diabetes and what Precautions to be taken? చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులా .. ప్రతీ కణాన్ని, అవయవాన్ని దెబ్బతిస్తుంది.
మధుమేహంతో గుండె, కిడ్నీ సమస్యలే కాకుండా ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. గ్లూకోజ్‌ను అదుపులో ఉంచుకోగలిగితే తీరని జబ్బులు వస్తాయి. ఇన్సులిన్ ఉంటే 50 శాతం జబ్బులు తగ్గిపోతాయి. వచ్చే ఆరోగ్య సమస్యలను బట్టి మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
పాదాల మంట.. చికిత్స – Foot inflammation and treatment :
దీనికి ప్రధాన కారణం నాడులు దెబ్బతినడం. ముఖ్యంగా స్పర్శ నాడులు దెబ్బతిన్నప్పుడు పాదాలూ మొద్దుబారినట్లు, దూదిమీద నడుస్తున్నట్లూ ఉంటుంది. ఒకవేళ మేకుల మీద నడిచినా స్పర్శ తెలియదు.
కొందరి చర్మానికి ఏమీ తాకకపోయినా.. తాకినట్లు ఉంటుంది. గాజు పెంకుల మీద నడుస్తున్నట్లు, చీమలు పాకుతున్నట్లు, సూది పెట్టి గుచ్చినట్లు ఉంటుంది. ఫ్యాను గాలి తగిలినా పాదాలు మంట పుడతాయి. కొందరిలో మధుమేహం బయటపడిన మొదటి రోజు నుంచే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
మధుమేహుల్లో కనిపించే మరో ముఖ్యమైన మొరాల్జియా పారెస్తిటికా . ఇందులో తొడల పక్కన, ప్యాంటు పక్కన జేబులు తగిలే చోట మంట పుడుతుంది.
దీనికి గ్లూకోజు నియంత్రణలో ఉంచుకోవడ ముఖ్యం. దీంతోపాటు ఫ్లూ ఆక్సిటీన్, ఎమిట్రోఫిలిన్, గాబా పెంటిన్, మిథైల్ కో బలమైన్, రకం మందులను మధుమేహులు వాడాల్సి ఉంటుంది.
విరేచనాలు, మలబద్ధకం – Diarrhea, Constipation :
తిన్న ఆహారం సాధారణంగా 30 నుంచి 45 నిమిషాల్లో జీర్ణాశయం నుంచి కిందికి వెళ్లిపోతుంది. దీనికి మధుమేహుల్లో చాలా సమయం పడుతుంది. గ్యాస్టో పెరెసిస్ చిన్న పెద్దా పేగులు మందగిస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం, తేల్పులు, మంట కలిగి ఇబ్బంది పెడతాయి. గ్లూకోజు నియంత్రణలో వాడే మెట్ ఫార్మిన్ , గ్లిప్టిన్ రకం మందులూ దీనికి దోహదం చేయొచ్చు.
పేగుల్లో ఆహారం నెమ్మదిగా కదలడం వల్ల మల బద్ధకం విరేచనాలు మార్చి మార్చి అవుతుంటాయి. పేగుల్లో ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు శరీరం దాన్ని నీళ్ల రూపంలో బయటకు పంపిచే ప్రయత్నం చేస్తుంది. పేగులు ఖాళీ కాగానే మళ్లీ రెండు మూడు రోజులపాటు మలబద్ధకంగా ఉంటుంది.
పేగుల పనితీరును మెరుగుపరిచే మందులు బాగా ఉపయోగపడతాయి. వీటితో మల విసర్ఝన సాఫీగా అవుతుంది. ఫలితంగా మలబద్ధకం, విరేచనాలు తగ్గిపోతాయి.
జననాంగ ఇన్‌ఫెక్షన్లు – Genital infections :
వీటికి ప్రధాన కారణం తెల్లరక్త కణాలు అస్తవ్యస్తం కావడం. యాంటీ బాడీల ఉత్పత్తి తగ్గటం. పలితంగా రోగ నిరోధక శక్తి తగ్గి జననాంగ భాగాల్లో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. మగవారిలో అంగం మీద తెల్లటి పొర ఏర్పడి పగిలినట్లు అవుతుంది.
మహిళల్లో తెల్లబట్ట రూపంలో కనిపిస్తుంది. గ్లూకోజు నియంత్రణలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. చర్మం తడిగా ఉండే గజ్జలు, కాలి వేళ్ల మధ్యలో ఇన్‌ఫోక్షన్లు వస్తాయి.
జననాంగం, చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాలి వేళ్ల మధ్య తడి లేకుండా ఉంచుకోవవడం మరీ ముఖ్యం. ఇన్‌ఫెక్షన్లకు యాంటీ ఫంగల్ మందులు ఉపయోగించడం మంచిది.
నోటి దుర్వాసన – Mouth bad smell :
మధుమేహుల్లో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి నోట్లో రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీని మూలంగా నోరు ఎండిపోయి నోటి దుర్వాసన వస్తుంది. అలాగే పేగుల్లో ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉండటం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, వల్ల చిగుళ్ల వాపు వస్తుంది.
మధుమేహుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా తగ్గటం ఇందుకు సమస్యే. దీంతో శ్వాస ద్వారా బయటకు వచ్చే గాలి పరిమాణం తగ్గి స్రావాలు లోపలే ఉండిపోతాయి. దీంతో నోటి దుర్వాసన వస్తుంది. నోటి శుభ్రత అత్యంత ముఖ్యం.
రెండు పూటలా పళ్లు తోముకోవాలి. డెంటల్ యాంటీ సెఫ్టిక్ ద్రావణాలతో నోరు పుక్కిలించాలి. పేగల కదలికలు, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి అవసరమైన మందులు వాడాలి.
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం – Memory loss :
మధుమేహం ఇబ్బంది పెట్టే మరో సమస్య గ్రహణ సామర్థ్యం తగ్గిపోవడం. అల్జీమర్స్ వచ్చే మతిమరుపు ఇందులో భాగమే. అందుకే అల్జీమర్స్‌ను మెదడు మధుమేహం అని అంటున్నారు.
మెదడులో ప్రోటీన్ల పనితీరు అస్తవ్యస్తం కావటం. మధుమేహుల్లో స్వల్ప, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తులు దెబ్బతింటాయి. రక్తంలో గ్లూకోజు స్థాయి పడిపోయిన వారికి దీని ముప్పు అధికంగా ఉంటుంది.
దురద : మధుమేహుల్లో చెమట కారణంగా చర్మం పొడిబారిపోయి దురద వస్తుంది. చర్మం మడతల్లో, దుస్తులు ఉన్న చోట చెమట ఎక్కువ వస్తే .. మిగిలిన ప్రాంతాల్లో చెమట అసలు రాదు. ఇలా చర్మ పొడిబారిన చోట దురదలు వస్తాయి. కాలేయ సమస్యలు, రక్త కణాల్లో లోపాలు ఇందుకు కారణం. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే చర్మ సమస్యలు దురదను తెచ్చి పెడతాయి.
మాటిమాటికీ మూత్రం – Continuesly Urine :
రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువ ఉంటే శరీరం దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. గ్లూకోజు నియంత్రణ స్థాయిలో ఉంటే పగటి పూట తగ్గొచ్చు కానీ,, రాత్రి సమయాల్లో ఈ సమస్య వేధిస్తునే ఉంటుంది.
మరికొన్ని జాగ్రత్తలు
పొగత్రాగడం మానెయ్యాలి – Avoid smoking :
పొగత్రాగడం వల్ల కాళ్లకు, పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోతోంది. ఇది ఇన్‌ఫెక్షన్లు, పుండ్లు ఏర్పడేందుకు కారణమవుతుంది. పండ్లు ఎంతకీ మానకపోతే కాలివేళ్లు , పాదాలు తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
గ్లూకోజు నియంత్రణ కష్టమై గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. కళ్లు, నాడులు, కిడ్నీలు వంటి అవయవాలు దెబ్బతింటాయి.
రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపు చేయడం – Controlling blood pressure and Cholesterol :
అధిక రక్తపోటూ రక్తనాళాలను దెబ్బతిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కూడా పక్షవాతం, గుండెపోటు ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. వ్యాయామం చేయడం ద్వారా వీటిని అదుపులో ఉంచుకోవచ్చు.
మద్యం జోలికి వెళ్లొద్దు – Avoid Drinking :
మద్యంతో గ్లూకోజ్ మోతాదు పెరగొచ్చు. తగ్గొచ్చు. కేలరీల గణనలో మద్యంతో లభించే కేలరీలు లెక్కలోకి తీసుకోవాలి. మత్తు వీడిన తర్వాత రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గిపోతాయి.
వేసవిలో గుండె, కిడ్నీలపై ఎండ ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒత్తిడినీ గమనించుకోవాలి – Stress :
మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడికి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రాణాయామం, ధ్యానం వంటివి సాధన చేయాలి. కంటి నిండా నిద్రపోవాలి.
మధుమేహం దీర్ఘకాలంలో రకరకాల జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రణలో ఉంచుకోవడం కీలకం.
తప్పకుండా మందులు వేసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్య కరమైన ఆహారం తినడం, బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. .