Summer Effects on heart and kidneys? What Precautions to be taken?
వేసవిలో గుండె, కిడ్నీలపై ఎండ ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. నెల ముందే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. Summer Effects on heart and kidneys? What Precautions to be taken? ఈ ఏడాది వేసవి ఎండలు మరింతగా ఉంటాయనే చెప్పొచ్చు.
ఎండ వేడి, వడగాలులు మనిషిని పిప్పి చేస్తాయి.చెమట రూపంలో శరీరంలో ఉన్న నీరు, లవణాలను బయటికి పంపించేస్తుంది.
ఫలితంగా శరీరంలో అలసట, నిస్సత్తువ లాంటిని ఆవహించి శరీరమంతా బలహీనంగా అవుతుంది. శరీరం ఉష్ణోగ్రత అంతకంతకు పెరిగి అవయవాలపై ప్రభావం చూపుతుంది.
Summer Effects on heart and kidneys? What Precautions to be taken?
ముఖ్యమంగా గుండె, కిడ్నీలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం ఉంది.
ముఖ్యంగా గుండె, కిడ్నీ జబ్బులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి.
నీటి శాతం తగ్గితే – low water content:
ఎండ వేడిని తట్టుకోవడానికి, సమస్యలు రాకుండా ఉండేందుకు శరీరం రకరకాలుగా ప్రయత్నిస్తుంది.
అయితే శరీరంలో చెమట పట్టడం దీనిలో భాగమే. అయితే చెమట గాలికి ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది మంచిదే. లేకపోతే శరీర ఉష్ణోగ్రత అంతకంతకూ పెరుగుతూ ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశం ఉంది.
అయితే చర్మానికి రక్తసరఫరా పెరిగే క్రమంలో కిడ్నీలకు సుమారు 30 శాతం వరకు రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో కిడ్నీలకు అవసరమైన ఆక్సీజన్, పోషకాలు తగ్గుతాయి.
చెమట కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గితే ఎక్కువ సేపు జరిగితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తద్వారా మూత్రం ఉత్పత్తి తగ్గటం, వాంతులు, కళ్లు తిరగటం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎండ వేడి, నీటి శాతం తగ్గడంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. తగినంత నీటిని తాగక పోతే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లూ వస్తాయి. అందువల్ల ఎండాకాలంలో కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
అధిక ప్రభావం – High impact :
మన శరీర బరువులో సుమారు 50 నుంచి 60 శాతం వరకు ఉండేది ద్రవాలే. అవయవాలు సక్రమంగా పని చేయడానికి ఇవి ముఖ్యమైనవి.
ద్రవాలతోపాటు ఖనిజ లవణాలు సమానంగా ఉండేందుకు తోడ్పాడేవి కి్డ్నీలే. ద్రవాల మోతాదులో ఏమాత్రం లోపించినా వీటి మీద ప్రభావం అధికంగా ఉంటుంది.
చెమట రూపంలో శరీరంలో నుంచి నీరు అంతా బయటకు వెళ్లినప్పుడు డీ హైడ్రేషన్ ( నీటి శాతం తగ్గటం) కు గురవుతారు. దీంతో రక్తంలోని ద్రవ భాగమూ (ప్లాస్మా) తగ్గుతుంది.
రక్త ప్రసరణ వ్యవస్థలో ద్రవాల మోతాదు 15 శాతం కన్నా ఎక్కువగా పడిపోతే హైపోవలీమియా అంటారు. ఇది అత్యంత ప్రమాదకర స్థితి.
కిడ్నీలకు సరఫరా అయ్యే రక్త పరిమాణం శాతం తగ్గుతంది. దీంతో రక్తం శుద్ధి అయ్యే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. తద్వారా వ్యర్థాల నిర్మూలన కుంటుపడుతుంది.
1. వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఇది మరీ ఎక్కువైతే శరీర కండరాలు క్షీణిస్తాయి.
కండరాలు క్షీణీంచడంతో మయేగ్లోబిన్ అనే ప్రోటీన్ రక్తంలోకి విడుదలవుతుంది. ఇది కీడ్నీలకు విఘాతంగా మారుతుంది.
డీహైడ్రేషన్‌తో రక్తంలో పోటాషియం మోతాదులు తగ్గడం జరుగుతుంది. దీంతో కి్డ్నీలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. యూరిక్ ఆమ్లం పెరిగినా కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
2. ఎండాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా కలుషిత నీటితో నీళ్ల విరేచనాలు, వాంతులు అవుతాయి. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఈ కారణంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నీరు, లవణాలను భర్తీ చేసినా. – Water and salts replaced :
శరీరంలో కోల్పోయిన నీరు, లవణాలను భర్తీ చేసినా అప్పటికే దెబ్బతిన్న కిడ్నీలు కుదురుకోవచ్చు. కానీ దీర్ఘకాలంలో హానీ కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న కొంతభాగం పూర్తిగా కోలుకోకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీ మళ్లీ దెబ్బతింటే ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారుతుంది. ఇలాంటి వ్యక్తులకు దీర్ఘకాల కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చివరికి కిడ్నీ వైఫల్యాలు సంభవించొచ్చు.
కిడ్నీ జబ్బులుంటే మరింత జాగ్రత్తగా..- Kidney problems :
- అప్పటికే కిడ్నీ జబ్బులు ఉన్నవారికైతే ఎండ వేడి మరింత ప్రమాదం. వీరిలో శరీర అవయవాలకు తగినట్లుగా రక్తాన్ని శుద్ధి చేసే వేగం తక్కువగా ఉంటుంది.
- కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారూ డి హైడ్రేషన్‌ను తట్టుకోలేరు. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
- కోల్పోయిన నీటిని తిరిగి శరీరానికి అందించాలి. లేకపోతే కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోవాలి.
- శరీరంలో చెమటతోపాటు సోడియం బయటకు వెళ్లినప్పుడు రక్తపోటు తగ్గుతుంది. ఇలా జరిగితే వైద్యులను సంప్రదించాలి.
- కిడ్నీ జబ్బులు ఉన్నవారు మూత్రం తగ్గినా, కాళ్ల వాపులు ఉన్నా, ఆయాసం వస్తున్నా నీరు తగ్గించుకోవాలి. ఎండలో ఉన్నప్పుడు చెమట ఎంత వస్తుందో గమనించి వైద్యులను సంప్రదించాలి.
- రక్తంలో నీటి శాతం తగ్గితే పోటాషియం తగ్గుతుంది. ఇది తిరిగి శరీరానికి అందకపోతే కండరాలు విచ్ఛిన్నమై కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు ఎక్కువ మేలు చేస్తాయి.
- అయితే కిడ్నీ జబ్పు ఉన్నవారు అరటిపళ్లు, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ వంటి వి తీసుకోకూడదు.
భారమంతా గుండెపైనే.. – Heavy burden on the heart :
వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రతి స్పందించడంలో శరీరంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది.
వేడిగా సమయంలో చల్లబడేందుకు, చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఉండేందుకు శరీరంలో రక్త ప్రసరణలో మార్పులే కారణం. అందుకే అధిక వేడి, అతి శీతలం గుండె మీద ప్రభావం చూపుతాయి.
చర్మంలో ఉండే రక్తనాళాలు విప్పారటం – Dilation of blood vessels :
వేడి గాలులు గుండె జబ్బులు ఉన్నవారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు శరీరంలో మూల (కోర్) ఉష్ణోగ్రత పెరుగుతుంది. చర్మానికి రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేయడానికి గుండె మరింత వేగంగా, బలంగా రక్తాన్ని పంప్ చేస్తుంది.
వాతావరణం చల్లగా ఉన్పప్పుడు కంటే వేడిగా ఉన్నప్పుడు ప్రతి నిమిషానికి గుండె 2-4 రెట్టు ఎక్కువగా రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది గుండె మీద అదనపు భారం పడేలా చేస్తుంది.
ఎవరికైనా గుండె రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్లయితే చర్మానికి ఎక్కువగా రక్తం సరఫరా అవుతున్న సమయంతో గుండెకు రక్త ప్రసరణ తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల గుండెకు హాని జరుగుతుంది.
చెమట ఆవిరయ్యే ప్రక్రియ – Evaporation of sweat :
చర్మంమీద ఆవిరయ్యే ప్రతి చెమట చుక్కా శరీరంలో నుంచి వేడికి బయటకు వెళ్లగొడుతుంది. చెమటతో నీరే కాదు సోడియం, పోటాషియం వంటి లవణాలూ బయటకు పోతాయి. కండరాలు సంకోచించడం, నాడుల మధ్య సమాచారానికి, ద్రవాల సమతుల్యతకు ఈ లవణాలు చాలా ముఖ్యం.
చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల ఈ ద్రవాల, ఖనిజాల సమతుల్యత అస్తవ్యస్తమవుతుంది. ద్రవాలు తగ్గటం, లవణాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు గుండె మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉంది.
ఈ లక్షణాలు ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినట్టే..!
నీటి విషయంలో జాగ్రత – Care of water
నీటిని అవసరానికి మించి తాగితే మూత్రం రూపంతో బయటకు వస్తుంది. కానీ గుండె బలహీనమైనా, గుండె విఫలమైన వారిలో హార్మోన్ల రూపంలో అదనపు నీరు శరీరంలో నే ఉంటుంది. ఇది గుండె మీద భారం పడేస్తుంది. ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తులో నీరు చేరుకుంటుంది.
అందువల్ల ఈ సమస్యలు ఉన్న వారు ఉప్పు, నీరు తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. గుండె పనితీరు బాగానే ఉన్నవారు మాములుగానే ద్రవాలు తీసుకోవచ్చు.
1 thought on “Summer Effects on heart and kidneys? What Precautions to be taken? వేసవిలో గుండె, కిడ్నీలపై ఎండ ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు”