If these symptoms..The immunity reduced in the body ..!ఈ లక్షణాలు ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినట్టే..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన రోగనిరోధక If these symptoms..The immunity reduced in the body ..! వ్యవస్థ అవసరం. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.
హానికరమైన బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవడంలోనూ, వివిధ వ్యాధులపై పోరాడటంలోనూ రోగనిరోధకవ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనిషి ప్రాణాలను కాపాడాలంటే ఇమ్యూనిటీ కీలకం.
అందుకే రోగ నిరోధక శక్తి దృఢంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం మనసొంతమవుతుంది.
శరీరంలో ఇమ్యూనిటీ తగ్గితే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే.. : Symptoms of reduced immunity in the body
తరచుగా జలుబు చేయడం : Frequently cold
రోగ నిరోధక శక్తి మన శరీరానికి కవచంలా పనిచేస్తుంది. హానికరమైన వైరస్, బ్యాక్టీరియా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.
అయితే కొందరిలో ఈ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచుగా జబ్బు పడుతూ ఉంటారు.
సాధారణంగా మనిషి ఏడాదిలో మూడు సార్లు జలుబు బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంతకంటే ఎక్కువ సార్లు జలుబు చేయడం, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడితే.. ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు గమనించాలి. ఒక్కోసారి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే వ్యాధులకు శస్త్ర చికిత్స చేయడం సాధ్యపడదు.
జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం : Digestive system
మనిషి ఆరోగ్యంగా ఉండటంలో జీర్ణక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. మనం తిన్న ఆహార పదార్థాలు సరిగ్గా జీర్ణమైతేనే శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి.
ఒకవేళ జీర్ణ క్రియ సరిగా పనిచేయకపోతే శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉందని తెలుసుకోవాలి. దీని వల్ల శరీరంలో అనే క అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా జాగ్రత్తలు పాటించాలి.
ఎక్కువ అలసట : Tired
కొంతమంది ఏదైనా పని చేయాలంటే ఉత్సాహంగా చేస్తారు. ఏమాత్రం అలసట చెందారు. కానీ మరికొంతమంది అదే పనిని అలసటతో చేస్తారు. అలా తక్కువ పనినే భారమైతే శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉందని నిర్ధారించుకోవాలి.
క్రమం తప్పకుండా ఉదయపు నడక, పరిగెత్తడం లాంటివి చేయడం వల్ల శరీరాన్ని అలసట నుంచి కాపాడుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వ్యాయమం ఎంతగానో ఉపయోగపడుతుంది.
గాయం త్వరగా మానకపోవడం :
ఆరోగ్యంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు త్వరగా మానిపోతాయి. అంటే వారిలో ఇమ్యూనిటీ అధికంగా ఉందని అర్థం. మరికొంత మందికి గాయాలైనపుడు త్వరగా మానవు. అవి దీర్ఘకాలం వారిని బాధిస్తునే ఉంటాయి.
అధిక ఒత్తిడి : Heavy Stress
చిన్న విషయాలకు కూడా కొంతమంతి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మరికొంత మంది ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులను చేస్తారు.
ఇలా చకచకా పనులు చేసే వారిలో ఇమ్యూనిటీ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న పనులకే ఎక్కువగా ఒత్తిడికి గురైతే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని గమనించాలి.
తరచుగా కీళ్లనొప్పులు వస్తుంటే.. : Joint Pains
తరచుగా కీళ్ల నొప్పులు వస్తుంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని గమనించుకోవాలి. దీనివల్ల శరీరంలో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా రక్తనాళంలో వాస్కులైటిస్ అని పిలిచే వాపు ని ఎదుర్కొవలసి వస్తుంది.
కీళ్ల లోపలి పొరలో మంట వస్తుంది. దీని కారణంగా ముఖానికి వాసు వస్తుంది. అలాగే గట్టి పడుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలిసిపోతోంది. . కీళ్ల నొప్పుల స్థాయికి చేరితే.. సమస్య తీవ్రమవుతోందని అర్థం. కాబట్టి దీనిని విస్మరించవద్దు.
రోగ నిరోధక శక్తి వివిధ వ్యాధులు, అనారోగ్యాల నుంచి కాపాడే బలమైన వ్యవస్థ. దీని వల్ల శరీరంలోకి ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియాలు, ప్రతికూల ప్రభావాన్నిచూపలేవు. రోగ నిరోధక శక్తి దృఢంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కీలకం.
రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు : Food that boost immunity
1.ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా (ప్రతీరోజుకు 450 నుంచి 500 గ్రాముల వరకు) తినాలి. ఆకు కూరల్లో బీటా కెరోటీన్, విటమిన్ సీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దండిగా దొరుకుతాయి.
2.తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.
3.అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. కార్బోనేటేడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటాయి.
4.మాంసం, గుడ్లు ఆరోగ్యానికి మంచిది. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. అయితే పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
5.శరీరంలో కొవ్వు(ఫ్యాట్)ను నియంత్రణలో ఉంచుకోవాలి. రోజుకు ఒక వ్యక్తి 30 గ్రాములకు మించి నూనెలు, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు.
చక్కెరలో కేవలం కెలొరీలు మాత్రమే ఉంటాయి, పోషకాలు ఉండవు. కాబట్టి, చక్కెరను కూడా మితంగా తీసుకోవాలి.
6.శారీరక వ్యాయామం, యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
7.తరచూ నీళ్లు తాగాలి. పొగతాగడం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఆ అలవాట్లు ఉన్నవారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వాటిని మానుకోవాలి.
8.మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి దాకా వాడుతున్న మందులను కొనసాగించవచ్చు.
వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
9.బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి.
10.నారింజ, నిమ్మకాయలు, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయలూ, కూరగాయాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాల సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి.
1 thought on “If these symptoms..The immunity reduced in the body ..! ఈ లక్షణాలు ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినట్టే..!”