మధు అంటే తియ్యని మరియు మేహం అంటే.. మూత్రము అని అర్ధం.. Why does diabetes occur? What are the health problems involved?మధుమేహం అంటే తియ్యని మూత్రం. రక్తంలో చక్కెర స్థాయి అధికమైనప్పుడు ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. కాబట్టి చక్కెర వ్యాధి వచ్చిందంటే అనేక అనారోగ్యాలు ఒకదాని వెంట మరొకటి వచ్చి శరీరాన్ని గల్ల చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయికి మించి పెరిగిపోతే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. దీనికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. లేకపోతే ప్రధానంగా కిడ్నీ, గుండు, కాలేయంపై ప్రభావం చూపిస్తుంది.
Why does diabetes occur? What are the health problems involved?
మధుమేహం రెండు రకాలు – Diabetes Two Types
1.టైప్ 1 మధుమేహం- Type 1 Diabetes
2.టైప్ 2 మధుమేహం – Type 2 Diabetes
టైప్ 1 మధుమేహం : Type 1 Diabetes
టైప్1 మధుమేహం ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ప్రధానంగా చిన్న వయసులోనే (10 నుంచి 35 ఏళ్లు) వస్తుంది. క్లోమ గ్రంథి శరీరంలో ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయకపోవడం మధుమేహం వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు మధుమేహులైతే ఆ ముప్పు మరీ ఎక్కువగా ఉంటుంది. టైప్1 మధుమేహానికి టెప్లిజుమాబ్ మందు తోడ్పడుతున్నట్లు తాజాగా బయటపడింది. ముఖ్యంగా టైప్ 1 మధుమేహం మగ పిల్లల్లో కన్నా ఆడపిల్లల్లో ఎక్కువగా వస్తుంది.
మధుమేహంతో బాధపడే పిల్లలకు ఆరోగ్య కరమైన ఆహారాన్నిఅందించాలి. వీరికి ఎలాంటి ఆహార నియమాలు పెట్టకూడదు. పిల్లలకు ఎదిగే వయసులో తగినంత పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వడం తప్పనిసరి. లేకపోతే పోషణలోపం ఎదురై పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తినే పరిమాణాన్ని బట్టి రక్తంలో చక్కెర స్థాయిలో మార్పు ఉంటుంది. బరువు పెరగకుండా.. ఎత్తు, వయసును బట్టి ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ బరువు పెరిగితే రక్తపోటు, కిడ్నీ వడపోత సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మధుమేహం వచ్చిన పిల్లలకు కొన్ని సమయాల్లో వాంతులు, విరేచనాలు, జ్వరంలాంటివి వస్తాయి. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోయి రక్తంలో ఆసిటోన్ అనే ఆమ్ల పదార్థాల శాతం పెరుగుతాయి. ఇందుకు వ్యాయామం చేయడం ద్వారా టైప్ 1 మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా మధుమేహం వచ్చిన చిన్నారులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలి.
టైప్ 2 మధుమేహం – Type 2 Diabetes
టైప్ 2 మధుమేహం రాకుండా అదుపులో ఉంచడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఎక్కువగా పెద్దవారిలో ఉంటుంది. ఈ రకం మధుమేహం మందులతో నియంత్రణలో ఉంచుకోవచ్చు.
క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను తగినంత ఉత్పత్తి చేయకపోయినా ఇన్సులిన్ సమర్థవంతంగా పని చేయకపోవయినా డయాబెటిస్ వస్తుంది. వయసు పెరిగే కొద్ది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని తగ్గించుకోవడానికి పిండిపదార్ధాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
డయాబెటిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.. – diabetes symptoms
- ఆకలి వేయడం
- అకస్మాత్తుగా బరువు తగ్గడం
- శరీరంలో ఎక్కడ దెబ్బలు, గాయాలు అయినప్పుడు త్వరగా నయం కావు.
- అలసిపోయినట్లు అనిపించడం
- ఎక్కువసార్లు మూత్రవిసర్ణన రాత్రి వేళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.
- కంటి చూపు మందగించడం
- మెడ చుట్టూ ముదిరిన చర్మం
- నోటిలో పుండ్లు ఏర్పడతాయి
- ఎన్నిసార్లు నీళ్లు తాగినప్పటికీ దాహం వేస్తూనే ఉంటుంది.
- చర్మ సంబంధ, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్ వస్తాయి.
- ఏ పని చేయాలని అనిపించదు. చిరాకుగా ఉంటుంది.
పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు
మల విసర్జన చేయడం కష్టంగా ఉంటుంది.
నిద్రించడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
వాంతులు అవుతాయి.
సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాథమిక సూత్రాలు
మధుమేహం ఎందువల్ల వస్తుంది? – What causes diabetes?
శరీరంలో పోషక లోపం.. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు సక్రమంగా అందనపపుడు ఈ వ్యాధి వస్తుంది.
అధిక బరువు పెరగడం, ప్రతి రోజు ఉదయాన్నే వ్యాయామం చేయకపోయినా తొందరగా ఈ వ్యాధి వస్తుంది.
కార్బొహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం, నూనె పదార్థాలు, నెయ్యి వల్ల మధుమేహం ఉన్నవారు తక్కువగా తీసుకోవాలి.
డయాబెటిస్ వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : Precautions to be taken by diabetes people
1.ప్రతి రోజు ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలనే ఎక్కువగా చిరుధాన్యాలు , మొలకెత్తే గింజలు తీసుకోవాలి.
2. ఆహారంలో ఉప్పును తగ్గించి తినడం మంచిది. నిల్వ ఉంచిన పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు తీసుకోకూడదు.
3.సమాయానికి ఆహారం తీసుకోవాలి.
4.వీలైనంత వరకు బంగాళదుంపలు, చిలగడ దుంపలు తినకుండా ఉంటే మంచింది.
5.తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం అన్నం మరియు రొట్టెల కంటే ఉడికించిన కూరగాయలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
6.యాపిల్, నారింజ, జామ, దానిమ్మ, బత్తాయి, బొప్పాయి పండ్లను తినవచ్చు.
7. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కనీసం గంటపాటు వ్యాయామం చేయాలి
8.మధుమేహం వచ్చిన వారు మద్యపానం, పొగ తాగడాన్నిపూర్తిగా మానేయాలి.
9.ప్రతి రోజూ కనీసం 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలి.
10.మామిడి, అరటి, ద్రాక్ష, సపోట, సీతాఫలం పండ్లలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది.
11.ఫ్రూట్ జ్యూస్, బయట చేసే జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్ తాగకూడదు.
12. వంటలో ఒకసారి ఉపయోగించిన నూనెతో మరోసారి ఆహార పదార్థాలు వండకూడదు.
13. మాంసంలో లివర్, కిడ్నీ, బ్రేన్, గుడ్డులోని పచ్చసొన, రొయ్యలు, పీతలు తీసుకోకపోవడం ఉత్తమం.
Keep it up write more articles 📝📝